WhatsApp New Secret Code | చాట్స్ ప్రైవసీ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్
యూజర్ల ప్రైవసీకి వాట్సాప్ మేజర్ అప్డేట్తో ముందుకొచ్చింది. చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను (WhatsApp New Secret Code) లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : యూజర్ల ప్రైవసీకి వాట్సాప్ మేజర్ అప్డేట్తో ముందుకొచ్చింది. చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను (WhatsApp New Secret Code) లాంఛ్ చేసింది. వాట్సాప్‌లో ఇప్పటికే తమ వ్యక్తిగత చాట్స్‌ను యూజర్లు లాక్ చేసుకునే సదుపాయం ఉన్నా అందులో లోటుపాట్లు ఉండటంతో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
యూజర్లందరికీ వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రవేశపెట్టడం ద్వారా భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో యూజర్లు తమ చాట్స్‌కు వర్డ్స్, ఎమోజీలతో యూనిక్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో కేవలం సీక్రెట్ కోడ్‌ను టైప్ చేసి లాక్డ్ చాట్స్‌ను యాక్సెస్ చేసేలా సెట్టింగ్స్‌ను సెట్ చేసే వెసులుబాటు ఉంది.
వాట్సాప్‌లో చాట్ లాక్ సీక్రెట్ కోడ్ ఫీచర్ ఎంట్రీతో యూజర్లు యూనిక్ పాస్‌వర్డ్‌తో వారి చాట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చని మెటా సీఈవో పేర్కొన్నారు. సెర్చ్ బార్లో సీక్రెట్ కోడ్ టైప్ చేసినప్పుడే లాక్డ్ చాట్స్ కనిపించేలా యూజర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో ఏ ఒక్కరూ యూజర్ల ప్రైవేట్ సంభాషణలను గుర్తించలేరని వాట్సాప్ పేర్కొంది.
Read More :
Air India | విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి నీటి లీకేజీ.. స్పందించిన ఎయిర్ ఇండియా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

