Whatsapp Pay | వాట్సాప్‌లో ‘₹’ సింబల్.. ఇక ఈజీగా పేమెంట్స్
ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ గతేడాది వాట్సాప్ పే ( Whatsapp Pay ) సేవలను ప్రారంభించిన విషయం తెలుసు కదా.

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ గతేడాది వాట్సాప్ పే ( Whatsapp Pay ) సేవలను ప్రారంభించిన విషయం తెలుసు కదా. అయితే తాజాగా ఈ సేవలను యూజర్లకు మరింత చేరువ చేయడానికి, సులువుగా పేమెంట్స్ జరిగిపోవడానికి వీలుగా ఇండియన్ రూపీ(₹) సింబల్‌ను వాట్సాప్ చాట్ బాక్స్‌లో యాడ్ చేసింది.
ప్రస్తుతం పేమెంట్స్ చేయడానికి రెండు దశలు దాటాల్సి ఉండగా.. ఈ తాజా అప్డేట్తో ఆ పని మరింత సులువుగా జరిగిపోనుంది. వాట్సాప్‌లో పేమెంట్స్‌ను ఈజీగా మార్చడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇక నుంచి పేమెంట్స్ కోసం కెమెరా యాప్ అన్ని మేజర్ క్యూఆర్ కోడ్స్‌ను గుర్తించనుంది. యూజర్లు డబ్బు బదిలీ చేయడానికి, ఆఫ్‌లైన్ పేమెంట్స్ చేయడానికి ఇది ఉపయోగపడనుంది.
ఈ అప్డేట్స్తో ఇండియాలో వాట్సాప్ పే సేవల వినియోగం పెరుగుతుందని ఆ సంస్థ భావిస్తోంది. వాట్సాప్ చాట్‌లో ఉంటూనే పేమెంట్లు చేసే వీలు ఇక నుంచి యూజర్లకు కలగనుంది. ఇండియాలో గూగుల్‌పే, ఫోన్పెలాంటి డిజిటల్ పేమెంట్స్ సర్వీసులు 35 శాతం, 45 శాతం యూపీఐ ట్రాన్సాక్షన్ల వాటా కలిగి ఉండగా.. వాట్సాప్ పే చాలా తక్కువ వాటాకే పరిమితమైంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

