Weight Loss | అధిక బరువుతో బాధపడుతున్నారా..? చాట్ జీపీటీతో ఇక నో వర్రీ..!
Weight Loss | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువులు దీర్ఘాలిక వ్యాధులు సైతం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దాంతో ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Weight Loss | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువులు దీర్ఘాలిక వ్యాధులు సైతం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దాంతో ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రచురించింది, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ మంది జనం ఊబకాయం సమస్యతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్.. వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ ఫెడరేషన్-2022 తెలిపింది.
ప్రతి ఏడుగురిలో ఒకరు ప్రమాదంలో..
ప్రతి ఐదురుగు మహిళల్లో ఒకరు.. ప్రతి ఏడుగురు మగవారిలో ఒకరు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక బరువు మధుమేహం, జీవక్రియ, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అధిక బరువుతో బాధపడుతున్నారు. క్రమంలో పలువురు బరువు తగ్గేందుకు పలు చిట్కాలు పటిస్తున్నారు. కొందరు భోజనం మానేయం, వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాల్లో పలు మార్పులు చేసుకుంటున్నారు. మరికొందరు నిపుణుల వద్దకు వారి సలహాలు సూచనలు పాటిస్తూ బరువును తగ్గించేందుకు ప్రయాసపడుతున్నారు.
చాట్ జీపీటీ డైట్ ప్లాన్..
ప్రస్తుతం ప్రపంచ కొత్త సాంకేతిక యుగం వైపు పరుగులు పెడుతున్నది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, చాట్ జీపీటీ వినియోగం పెరిగింది. ఎన్నో విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు చింతించాల్సిన అవసరం లేదని, ChatGPT, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల గ్రెగ్ ముస్చెన్ అనే వ్యక్తి చాట్ జీపీటీ చేసిన డైట్‌ప్లాన్ ద్వారా 11.7 కిలోల బరువు తగ్గినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఛాట్ జీపీటీ రొటీన్లో భాగంగా డైట్ ప్లాన్ చేసింది. ఇందులో రన్నింగ్, వాకింగ్ సహా ఆహారంలో పలు సాధారణ మార్పులు సూచించింది. చాట్ జీపీటీ, ఏఐ సూచించిన డైన్ ప్లాన్ అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందని అంచనా వేశారు.
ఎంత వరకు ప్రభావవంతంగా ఉంటుంది..?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఛాట్ జీపీటీ ఇచ్చిన డైన్ ప్లాన్ ఎంత వరకు ప్రభావవంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న తలెత్తుతున్నది. ఈ క్రమంలో పరిశోధకుల బృందం సర్వే నిర్వహించింది. ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు ప్రభావంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ ఆహారానికి సంబంధించిన సలహాలు మాత్రమే కాకుండా.. మీ ఆరోగ్యానికి ఏవి ప్రయోజనకరంగా ఉంటాయి.. ఏవి తినకూడదో స్పష్టంగా చెప్పగలదని స్పష్టం చేస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..?
కెనడాలోని విద్యావేత్తలు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) పేరుతో పిలిచే నిర్దిష్ట ఏఐని ఉపయోగిస్తుంటారు. ఆహార ఉత్పత్తులను మాన్యువల్‌గా వర్గీకరించేందుకు అవసరమైన సమయాన్ని తగ్గించడానికి సాంకేతికతను ఉపయోగించవచ్చని ఓ అధ్యయనంలో గుర్తించారు. చాట్ జీపీటీని డైన్ ప్లాన్‌ను నిపుణులు పరిశీలించగా.. మిశ్రమ ఫలితాలు కనిపించాయి. అలెర్జీ బాధితుల కోసం డైట్ ప్లాన్‌ను రూపొందించేందుకు చాట్‌బాట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రజల ఆరోగ్యం ఆధారంగా ఆహార ప్లాన్‌ను అందించగలదని, బరువు తగ్గించడంలో సహాయపడడే మాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికత వినియోగంతో ఆరోగ్యరంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయని, ChatGPT, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రయోజనాలు పొందే అవకాశాలుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

