న్యూఢిల్లీ : రూ పదివేల లోపు ధరలో వివో వై01 స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసింది. మీడియాటెక్ హిలియో పీ35 ఎస్ఓసీ చిప్సెట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మి 10ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎంఓ2కు వివో దీటైన పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. వివో వై01 ధర రూ 8999 కాగా, ఇవి త్వరలో వివో ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఎలిగెంట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్స్‌లో వివో వై01 లభిస్తుంది.
వివో వై01 ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 6.51 ఇంచ్ హెచ్డీ ప్లస్ హాలో ఫుల్ వ్యూ డిస్ప్లేతో వివో నేటివ్ ఐ ప్రొటెక్షన్ మోడ్‌తో అందుబాటులో ఉంటుంది. వివో లేటెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1పై రన్ అవుతుంది.