Vivo : చైనాకు చెందిన వివో బ్రాండ్ నుంచి ఒకే రోజు మూడు ఫోన్లు, ఇతర డివైజ్‌లు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. అందులో ఒక ఫోల్డబుల్ ఫోన్ కూడా ఉంది. అన్నీ దాదాపు ఫ్లాగ్షిప్ ఫోన్లు. పవర్ ఫుల్ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే వంటి ఫీచర్లున్నాయి. అలాగే, ఆరిజిన్ ఓఎస్ 7ను కూడా ఇండియన్ మార్కెట్లోకి వివో తీసుకొచ్చింది. వివో ఎక్స్ ఫోల్డ్ 6 పేరుతో ఒక ఫోల్డబుల్ ఫోన్ విడుదల కాగా.. వివో వీ80 పేరుతో రెండో ఫోన్, వివో ఎస్2ఎఫ్ఈ పేరుతో మరో ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్లలోని ప్రధాన ఫీచర్లివి.
వివో ఎక్స్ ఫోల్డ్ 6
8.02 అంగుళాల ఎల్టీపీవో అమోలెడ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్, 6.51 అంగుళాల అమోలెడ్ కవర్ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ ప్రాసెసర్, 5,000 పీక్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజిన్ ఓఎస్ 7, 6,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 200 ఎంపీ జీఎస్ పార్ట్నర్షిప్ కలిగిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా+50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా+50ఎంపీ పెరిస్కోపిక్ లెన్స్, ఇన్నర్ కవర్ డిస్ప్లేలో 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ58, ఐపీ59 రేటింగ్, 12జీబీ+512జీబీ. ధర రూ.2,19,999. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లభ్యం. అక్టోబర్ 13 నుంచి ఆన్‌లైన్‌తోపాటు వివో స్టోర్స్‌లో సేల్కు అందుబాటులో ఉంటుంది.
వివో వీ80
ఇది కూడా 5జీ ఫ్లాగ్ షిప్ ఫోన్. 6.59 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా (50 ఎంపీ జీసిస్ ఆప్టిక్స్ సోనీ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్+50ఎంపీ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్), 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్, ఐపీ68, ఐపీ 69 రేటింగ్, ఆండ్రాయిడ్ 17 బేస్డ్ ఓరిజిన్ 7 ఓఎస్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+512జీబీ వంటి ఫీచర్లున్నాయి. స్టెల్లార్ బ్లాక్, హారిజన్ బ్లూ, సన్‌రైజ్ యాంథమ్ కలర్స్‌లో లభ్యం. ధరలు రూ.62,999, రూ.69,999, రూ.79,999. అక్టోబర్ 13 నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది.
వివో ఎస్2ఎఫ్ఈ
ఇది కూడా దాదాపు ఫ్లాగ్షిప్ రేంజ్‌లోనే ఉన్న 5జీ ఫోన్. 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఈ 5జీ చిప్సెట్, 10,000 ఎంఏహెచ్ బ్లూవోల్ట్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ ఛార్జింగ్, ఆరిజిన్ ఓఎస్6, 50ఎంపీ సోని మెయిన్ కెమెరా+2ఎంపీ సెకండరీ లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ68, ఐపీ69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబులిటీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. స్టెల్లార్ గ్రీన్, టైటాన్ బ్లాక్, జెన్ వైట్ కలర్స్‌లో లభ్యం. అక్టోబర్ 20 నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది. ధరలు రూ.38,999, రూ.42,999.