uber | ప్రముఖ క్యాబ్ బుకింగ్ యాప్ ఉబెర్ సంస్థ తన సేవలను రోజురోజుకూ విస్తరిస్తోంది. దాదాపు అన్ని ప్రపంచదేశాల్లో ఉన్న ఈ క్యాబ్ యాప్ తాజాగా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ఎక్స్ప్లోర్(Explore). ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు.. క్యాబ్ బుకింగ్‌తో పాటు.. డిన్నర్ రిజర్వేషన్స్, లైవ్ ఈవెంట్స్, ఇతర ఫన్ యాక్టివిటీలను బ్రౌజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న పేటీఎం, జొమాటో, బుక్‌మైషో లాంటి యాప్స్‌కు దీటుగా ఉబెర్ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఎక్స్ప్లోర్ ఆప్షన్‌ను ఓపెన్ చేయగానే.. కస్టమర్ లొకేషన్ ఆధారంగా దగ్గర్లో ఉన్న ఫుడ్ రెస్టారెంట్లు, డ్రింక్, ఆర్ట్, కల్చర్, నైట్ లైఫ్, మ్యూజిక్, షో లాంటి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూఎస్‌లో 14 నగరాల్లో ప్రారంభించారు. మెక్సికోలో కూడా ఇటీవలే ప్రారంభం అయింది. భారత్‌కు కూడా త్వరలోనే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఉబెర్ సన్నాహాలు చేస్తోంది.