Apple | త్వరలో ఐఫోన్ సహా యాపిల్ డివైజ్‌లకు జనరేటివ్ ఏఐ ఫీచర్లు : టిమ్ కుక్
Apple : ఈ ఏడాది ఐఫోన్, మ్యాక్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
Apple : ఈ ఏడాది ఐఫోన్, మ్యాక్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రానున్న ఐఓఎస్ 18 అప్డేట్ ఏఐ పవర్‌తో రానుందని భావిస్తున్నారు.
శాంసంగ్, గూగుల్ ఇప్పటికే తమ సొంత ల్యాంగ్వేజ్ మోడల్స్‌లో ఏఐ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టగా యాపిల్ నుంచి ఎలాంటి ఏఐ అప్డేట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న యాపిల్ ఫ్యాన్స్‌కు టిమ్ కుక్ ప్రకటన ఉత్తేజాన్ని ఇచ్చింది.
జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ ఫీచర్లపై కసరత్తు సాగుతోందని, సంవత్సరాంతానికి ఈ సేవలు కస్టమర్లకు చేరతాయని టిమ్ కుక్ ఇటీవల ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వెల్లడించారు. ఏఐ సహా భవిష్యత్ టెక్నాలజీపై పెట్టుబడులను యాపిల్ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఏఐ ప్రణాళికలపై కుక్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఏఐతో యాపిల్‌కు భారీ అవకాశం ఉందని చెప్పారు.
Read More :
Xiaomi 14 Series | త్వరలో షియోమీ 14 సిరీస్ ఫోన్లు భారత్ మార్కెట్లో ఆవిష్కరణ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- generative AI
- IPhone
- Tim Cook
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

