Xiaomi 14 Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్ గతేడాది అక్టోబర్ నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లోకి వస్తున్న షియోమీ 14 సిరీస్ ఫోన్లు – షియోమీ 14, షియోమీ 14 ప్రో ఫోన్లను ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ ఫోన్లు లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తాయని తెలుస్తున్నది.
గతేడాది దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన షియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్, షియోమీ 13టీ ఫీచర్ ఫోన్లు లైకా ట్యూన్డ్ కెమెరాలతో వచ్చాయి. 2022లో లైకా కంపెనీతో షియోమీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. లైకా సమ్మిలక్స్ కెమెరాలతో ఈ ఫోన్లు వస్తాయని తెలుస్తున్నది. షియోమీ 13 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 పలికింది. ఇక చైనాలో గత అక్టోబర్‌లో ఆవిష్కరించిన షియోమీ 14 ఫోన్ ధర 3999 చైనా యువాన్లు (సుమారు రూ.50 వేలు), షియోమీ 14 ప్రో ఫోన్ ధర 4999 చైనా యువాన్లు (సుమారు రూ.56,500) పలుకుతున్నది.
షియోమీ హైపర్ ఓఎస్ ఇంటర్ ఫేస్ గల షియోమీ 14 సిరీస్ ఫోన్లు క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే విత్ 2కే రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. లైకా ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. షియోమీ 14 ప్రో ఫోన్ 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. షియోమీ 14 ఫోన్ 90 వాట్ల వైర్డ్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10 మెగా పిక్సెల్ రివర్స్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది.