Google Search | ఒకప్పుడు ఏదైనా విషయం తెలియకపోతే పక్కవాళ్లను అడిగి తెలుసుకునేవాళ్లం ! కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ యుగంలో అలా కాదు !! ఏ విషయం తెలియకపోయినా గూగుల్‌ని అడిగేస్తున్నారు ! చిటికెలో సమాధానం తెలుసుకుంటున్నారు ! ఏదైనా అడ్రస్ కావాలన్నా.. ఎవరి గురించి అయినా తెలుసుకోవాలని అనుకున్నా.. చివరకు వంట చేయాలన్నా.. ఇలా ఏ విషయమైనా సరే తెలుసుకోవాలని అనుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఏడాది కాలంలో నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ సెర్చ్ వేటి గురించి చేశారో తెలుసా ! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దగ్గరలో ఉన్న షాపులు, హోటళ్లు, రెస్టారెంట్ల గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. కొవిడ్ టెస్ట్ నియర్ మి, ఫుడ్ షెల్టర్ నియర్ మి, లిక్కర్ షాప్ నియర్ మి, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ నియర్ మి వంటి అవసరాల కోసం ఎక్కువగా నెటిజన్లు వెతికారు.
పన్నీర్ ఎలా చేయాలి ( హౌటు మేక్ పన్నీర్ ), రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి ( హౌ టు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ ), డల్గోనా కాఫీ ఎలా చేయాలి ( హౌ టు మేక్ డల్గోనా కాపీ ), ఆధార్‌తో పాన్ అనుసంధానం ఎలా చేయాలి ( హౌ టు లింక్ పాన్ విత్ ఆధార్ ), ఇంట్లోనే శానిటైజర్ ఎలా తయారు చేయాలి ( హౌ టు మేక్ శానిటైజర్ ఎట్ హోం ), ఫాస్టాగ్ రీచార్జ్ ఎలా చేయాలి ( హౌ టు రీచార్జ్ ఫాస్టాగ్ ), కరోనా వైరస్‌ను ఎలా నిరోధించాలి ( హౌ టు ప్రివెంట్ కరోనా వైరస్ ), ఈపాస్ ఎలా అప్లై చేయాలి ( హౌటు అప్లై ఈ పాస్ ), జిలేబీ ఎలా తయారుచేయాలి ( హౌ టు మేక్ జిలేబీ ), కేక్ ఎలా తయారు చేయాలి ( హౌ టు మేక్ కేక్ ఎట్ హోం ) వంటి పదాలతో పాటు హౌ టు బీ యాంటీ రేసిస్ట్ అనే పదాలను వెతికారు.
కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వాళ్లు సొంతంగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టారు. దీనికోసం తక్కువ పెట్టుబడితో ఎలాంటి వ్యాపారాలు చేయవచ్చు? నష్టపోకుండా చేయగలిగే బిజినెస్‌లు ఏమున్నాయో తెలుసుకోవడంపై చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు.
వాట్ ఈజ్ కరోనావైరస్, వాట్ ఈజ్ బినోద్ పదాలను అధికంగా నెటిజన్లు వెతికారు. గత ఏడాది ఆగస్టులో చాలామంది వాట్ ఈజ్ బినోద్ అనే పదాన్ని సెర్చ్ చేశారు. ఆ తర్వాత వాట్ ఈజ్ ప్లాస్మా థెరపీ, వాట్ ఈజ్ సీఏఏ పదాలను వెతికారు. సూర్యగ్రహణం నేపథ్యంలో రింగ్ ఆఫ్ ఫైర్ గురించి కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా ఈ వైరస్ భయపెడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో చైనాలో హంటా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇది కూడా కరోనాలాగే వ్యాపిస్తుందేమోనని.. దాని గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు. అసలు హంటా వైరస్ అంటే ఏంటి? అది ఎలా వ్యాపిస్తుంది? అది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.
కరోనావైరస్, లాక్డౌన్ కారణంగా చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కాలక్షేపం కోసం ఎక్కువ మంది మొబైల్‌పై అధారపడ్డారు. ముఖ్యంగా గేమ్స్ ఆడటంపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు. దీంతో ఏ గేమ్స్ బాగున్నాయి? ఏవి ఆడొచ్చనే విషయాలపై ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారు. లాక్డౌన్ ప్రారంభం అయ్యాక 45 శాతం మంది భారతీయులు మొబైల్ గేమ్స్‌లో మునిగిపోయినట్లు ఇన్‌మొబి యాడ్టెక్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా వెళ్లడైంది.
రైతుల అభ్యున్నతి కోసమని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. రైతన్నలు వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో అసలు కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. సెప్టెంబర్‌లో 60వేలకు పైగా నెటిజన్లు ఈ వ్యవసాయ చట్టాల గురించి వాట్ ఈజ్ ఫార్మర్ బిల్ 2020 ఇన్ ఇండియా పేరుతో సెర్చ్ చేశారు.
అమెరికా ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. అలాగే రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి అరెస్ట్ గత ఏడాది సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇక బైడెన్, అర్ణబ్ తర్వాత బాలీవుడ్ నటి కనికా కపూర్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, రషీద్ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హ్యారిస్, అంకితా లోఖండే, కంగనా రనౌత్‌ల గురించి వెతికారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
5G రావడానికి ఎందుకంత లేటవుతుంది? ఆలస్యం మంచికేనా?
నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన కేటగిరీలు ఇవే!