Whatsapp | వాట్సాప్‌లో మళ్లీ ఆ ఫీచర్ రీ ఎంట్రీ.. వాటిపై ఫిర్యాదూ చేయొచ్చు..!
Whatsapp | ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మెసేజ్ లు ఫార్వర్డ్ లేదా డిలిట్ లేదా మ్యూట్ చేసే ఫీచర్.. డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
Whatsapp | సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తన యూజర్ల కోసం పాత ఫీచర్ తిరిగి అందుబాటులోకి తెస్తున్నది. ఇందులో వచ్చే మెసేజ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సందేశాలను ఒకేసారి ఎంపిక చేసి ఇతరులకు పంపడానికి గానీ, పూర్తిగా తొలగించడానికి గానీ మల్టీపుల్ చాట్ సెలక్షన్ ఫీచర్ వినియోగించేవారు. గతంలో డెస్క్‌టాప్ యాప్ నుంచి వాట్సాప్ ఈ ఫీచర్ తొలగించింది. యూజర్ల నుంచి అభ్యర్థనలు రావడంతో తిరిగి ఈ ఫీచర్ అందుబాటులోకి తేనున్నది.
ప్రస్తుతం మొబైల్ యాప్, వెబ్ వర్షన్ యూజర్లు మాత్రమే ఈ మల్టీపుల్ చాట్ సెలక్షన్ ఫీచర్ వినియోగిస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని సమాచారం. త్వరలో సాధారణ యూజర్లకు సెలెక్ట్ చాట్స్ అందుబాటులోకి రానున్నది. అదే జరిగితే వాట్సాప్ యూజర్లు ఒకేసారి ఒకటికంటే ఎక్కువ మెసేజ్‌లు ఎంపిక చేసి ఫార్వర్డ్ / డిలిట్/ మ్యూట్ చేయొచ్చు.
ఇంకా వాట్సాప్ యూజర్లు తమకు నచ్చిన టెక్ట్స్, మీడియా ఫైల్స్, వెబ్ లింక్‌లు ఇతరులు చూసేలా తమ స్టేటస్‌లో పెడుతుంటారు. అలా పెట్టే స్టేటస్‌లపై అభ్యంతరాలు ఉన్న యూజర్లు ఇక నుంచి వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం స్టేటస్ అప్డేట్ అనే ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నదని తెలుస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

