న్యూఢిల్లీ : నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ యాపిల్ యూనిక్ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌తో కస్టమర్ల ముందుకొస్తాయని ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మారక్ గుర్మన్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వనున్న అప్‌కమింగ్ ఐఫోన్లు టైప్-సీ పోర్ట్‌ను కలిగిఉంటాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ప్రీమియం లుక్‌తో కట్టిపడేసేందుకు టైటానియం ఫ్రేమ్‌తో ఆకట్టుకోనున్నాయి.
స్టీల్ కంటే టైటానియం తేలికగా ఉండటంతో పాటు మెరుగైన మన్నికను కలిగి ఉంటుంది. న్యూ ఐఫోన్ 15 మోడల్స్ ఫాస్టర్ ప్రాసెసర్లతో రానున్నాయని గుర్మన్ చెప్పుకొచ్చారు. ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో వాడిన ఏ16 బయోనిక్ చిప్‌లకు కొనసాగింపుగా ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌లో ఏ17 బయోనిక్ చిప్‌ను యాపిల్ వాడనుంది.
ఇక ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌ల్లో ఏ17 బయోనిక్ చిప్ వాడుతుండగా మిగిలిన మోడల్స్ పాత చిప్‌సెట్‌తోనే రానున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఐఫోన్ 15 మోడల్స్ అన్నింటిలో మెరుగైన కెమెరాలు ఉంటాయని యాపిల్ ఇప్పటికే వెల్లడించింది.