TCS | టీసీఎస్ తీపికబురు.. 46వేల మంది ఫ్రెషర్స్‌కు ఆఫర్లు
ఆర్ధిక మందగమనంతో ఫ్రెషర్ల నియామకంలో టీసీఎస్ (TCS) వంటి ఐటీ కంపెనీలు జాప్యం చేస్తున్నాయని వార్తలు రాగా తాజాగా హైరింగ్స్పై టీసీఎస్ తీపికబురు అందించింది
న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో ఫ్రెషర్ల నియామకంలో టీసీఎస్ (TCS) వంటి ఐటీ కంపెనీలు జాప్యం చేస్తున్నాయని వార్తలు రాగా తాజాగా హైరింగ్స్పై టీసీఎస్ తీపికబురు అందించింది. 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను 46,000 మంది ఫ్రెషర్స్‌ను విధుల్లోకి తీసుకున్నట్టు టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు.
ఫ్రెషర్స్‌కు ఇచ్చిన జాబ్ ఆఫర్లను కంపెనీ గౌరవిస్తోందని 45,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకున్నామని చెప్పారు. కంపెనీ నిర్వహించిన నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌కు 6,00,000 మంది అభ్యర్ధులు హాజరుకాగా 46,000 ఆఫర్లు అందించామని తెలిపారు. వార్షిక టార్గెట్‌ను అధిగమిస్తూ 46,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేశామని అన్నారు.
2022 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ లక్షకు పైగా ఫ్రెషర్స్‌ను హైర్ చేసిందని చెప్పారు. తాము అభ్యర్ధులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవించామని, ఇదే ఒరవడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫ్రెషర్స్‌ను కంపెనీలోకి తీసుకోవడంలో ఒకట్రెండు నెలలు జాప్యం జరిగినా జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవించామని అన్నారు. రాబోయే రోజుల్లో వేతనాలను తగ్గించే ప్రసక్తే లేదన్నారు. తాము ఆఫర్ చేసిన వాటికి తాము కట్టుబడి ఉన్నామని ఆయనన స్పష్టం చేశారు.
Read More
Apple Store | ముంబై ఆపిల్ స్టోర్ చుట్టుపక్కలా 22 బ్రాండ్లపై బ్యాన్.. ఇవీ కారణాలు..?!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

