న్యూఢిల్లీ : యువత స్మార్ట్‌వాచ్‌లను కోరుకోవడంతో మార్కెట్లో పలు స్మార్ట్‌వాచ్‌లు సందడి చేస్తున్నాయి. నాయిస్, బోట్, రియల్‌మి, బౌల్ట్, ఫైర్‌బోల్ట్ వంటి కంపెనీలు స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో పలు ఆకర్షణీయ ప్రోడక్ట్లను లాంఛ్ చేస్తున్నాయి. గతంలో స్మార్ట్ వాచ్‌లను సొంతం చేసుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్ధితి ఇప్పుడు మారిపోయింది.
రెండు వేల రూపాయల లోపు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. హాట్ ఫీచర్లతో తక్కవ ధరతో స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నాయి. హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకింగ్, వ్యాయామానికి వెచ్చించిన సమయం వంటి ఎన్నో హెల్త్ ఫీచర్లను బడ్జెట్ స్మార్ట్వాచ్ల్లోనూ పొందుపరిచారు. కొన్ని వాచ్‌లు మీ రిస్ట్ నుంచి ఏకంగా కాల్ చేసే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి. ఇక రూ 2000లోపు భారత్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లను చూస్తే..
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ రూ . 1799
బౌల్ట్ కాస్మిక్ రూ . 1999
బోట్ వేవ్ లైట్ రూ . 1999
ఫైర్‌బోల్ట్ నింజా 3 స్మార్ట్‌వాచ్ రూ . 1599
బౌల్ట్డ్రిఫ్ట్ రూ . 1499