SBI : ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్.. పాస్వర్డ్ ఇలా పెట్టుకోకపోతే హ్యాకర్ల టార్గెట్ మీరే..!
ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక టెక్నాలజీని అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సైబర్ నేరాలే. స్మార్ట్ ఫోన్‌కు ఏదైనా మెసేజ్ వస్తే చాలు.. అది సైబర్ నేరగాళ్లు పంపించారా? అనే టెన్షన్. ఏదైనా లింక్ వస్తే చాలు.. దాన్ని క్లిక్ చేయాలా వద్దా అనే భయం. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేవాళ్లు, ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్లు, ఆన్లైన్లో లావాదేవీలు చేసేవాళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారు.

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ముందు.. తెలియని లింక్స్‌ను ఓపెన్ చేయకూడదు. ఎవరైనా ఫోన్ చేసి కార్డుల వివరాలు అడిగితే చెప్పకూడదు. ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సులభమైన పాస్వర్డ్స్ పెడితే.. సైబర్ నేరగాళ్లకు వాటిని క్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

అందుకే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేవాళ్లు.. ఎలాంటి పాస్వర్డ్ పెట్టుకుంటే హ్యాకర్ల టార్గెట్ అవ్వరో ఓ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ 8 విధానాల్లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే.. హ్యాకర్లు మీ జోలికి రారు
పాస్‌వర్డ్‌లో ఖచ్చితంగా ఇంగ్లీష్ లెటర్స్ పెద్దవి, చిన్నవి రెండూ ఉండేలా చూసుకోవాలి. అయితే అప్పర్ కేస్.. లేకపోతే లోయర్ కేస్ అస్సలు ఉపయోగించకూడదు. రెండు విధానాల్లో పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఉదాహరణకు.. aBjsE7uG ఇలా ఉండాలి.
ఇంగ్లీష్ లెటర్స్‌తో పాటు.. నెంబర్లు, సింబల్స్‌ను ఉపయోగించండి. ఉదాహరణకు.. AbjsE7uG61!@
పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అప్పుడే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. aBjsE7uG
కామన్ డిక్షనరీ పదాలను అస్సలు వాడకండి. ఉదాహరణకు itislocked లేదా thisismypassword లాంటి పదాలను అస్సలు వాడకూడదు.

కీవర్డ్లో లైన్లో ఉండే లెటర్స్‌ను అస్సలు వాడకండి. ఉదాహరణకు.. qwerty లేదా asdfg లాంటి సిరీస్‌ను వాడొద్దు. దాని బదులు కీబోర్డ్‌తో ఓ ఆట ఆడుకోండి.. :), :/ లాంటి ఎమోటికాన్స్‌ను ఉపయోగించండి.
సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్స్‌ను అస్సలు పెట్టుకోవద్దు. ఉదాహరణకు 12345678 లేదా abcdefg
లాంటి పాస్‌వర్డ్స్‌ను అస్సలు పెట్టుకోవద్దు.
ఈజీగా గెస్ చేయగలిగే పాస్‌వర్డ్స్‌ను అస్సలు పెట్టుకోకండి. ఉదాహరణకు DOORBELL లేదా DOOR8377 లాంటి పాస్‌వర్డ్స్‌ను పెట్టుకోకండి.
మీ పాస్వర్డ్ పెద్దగా ఉండాలి. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, పుట్టిన రోజు, పుట్టిన సంవత్సరం లాంటివి అస్సలు వాడకండి. ఉదాహరణకు.. Ramesh@1967 లాంటి పాస్వర్డ్స్ అస్సలు పెట్టుకోకూడదు.
మీ పాస్వర్డ్ అంటే.. అది మీ సంతకం. మీ సంతకం ఎలా యూనిక్‌గా ఉంటుందో.. మీ పాస్వర్డ్ కూడా అంతే యూనిక్‌గా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి.. అంటూ ఎస్బీఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
A strong password ensures higher levels of security. Here are 8 ways in which you can create an unbreakable password and protect yourself from cybercrime. Stay alert & #SafeWithSBI! #CyberSafety #StrongPassword #OnlineSafety #CyberCrime #StaySafe pic.twitter.com/ScSI8H5ApF
— State Bank of India (@TheOfficialSBI) August 18, 2021
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

