Robots | రోబోలు మనుషులపై తిరుగుబాటు చేస్తాయా ? జెనీవాలో జరిగిన హ్యూమన్-రోబో కాన్ఫరెన్స్‌లో రోబోల సంచలన వ్యాఖ్యలు
Robots | రాబోయే రోజుల్లో ఏఐతో ముప్పుతప్పదని 42 శాతం మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రోబోలు (Robots) మాత్రం వాటి సృష్టికర్తలపై తిరుగుబాటుకు పూనుకోమని వెల్లడవడం ఊరట కలిగిస్తోంది.
Robots | న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ, బార్డ్, బింగ వంటి ఏఐ టూల్స్‌కు విశేషాదరణ సొంతం కావడంతో ఏఐపై అనూహ్యంగా టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ ఊపందుకుంది. న్యూ టెక్నాలజీతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ విధ్వంసానికీ ఈ టెక్నాలజీ నాంది కాబోతోందనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. యేల్ సీఈవో సమ్మిట్‌లో జరిగిన సర్వేలో సైతం రాబోయే రోజుల్లో ఏఐతో ముప్పుతప్పదని 42 శాతం మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రోబోలు (Robots) మాత్రం వాటి సృష్టికర్తలపై తిరుగుబాటుకు పూనుకోమని వెల్లడవడం ఊరట కలిగిస్తోంది.
జెనీవాలో ఇటీవల జరిగిన హ్యూమన్-రోబో కాన్ఫరెన్స్ ఆసక్తికర విషయాలకు కేంద్రబిందువైంది. తొలి హ్యూమన్, రోబోట్ విలేకరుల సమావేశంలో 9 హ్యూమనాయిడ్ రోబోలు ఆ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. జెనీవాలో జరిగిన మంచి కోసం ఏఐ అనే అంశంపై జరిగిన సదస్సులో తొమ్మిది హ్యమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. ఆకలి, వ్యాధులు, పేదరికం వంటి ప్రపంచం ఎదుర్కొనే సమస్యలను చక్కదిద్దేందుకు ఏఐ, రోబోలను సమన్వయం చేసేలా జరిగిన కార్యక్రమంలో రోబోలు పాలుపంచుకున్నాయి.
ఈ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించిన రోబోల్లో విల్ జాక్సన్ సృష్టించిన అమెకా కూడా ఉంది. మీ సృష్టికర్తపై తిరుగుబాటుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఓ జర్నలిస్టు అడగ్గా అమెకా బదులిస్తూ అలాంటిదేమీ లేదు..మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు..మా క్రియేటర్ ఎంతో దయకల వ్యక్తి..నా ప్రస్తుత పరిస్ధితిపై ఎంతో సంతోషంగా ఉన్నా అని బదులిచ్చింది. ప్రపంచంలో రోబోలు తీసుకువచ్చే మార్పు గురించి ప్రస్తావిస్తూ తన వంటి రోబోలు మానవ జీవితాలను మెరుగుపరిచి ప్రపంచాన్ని నివసించేందుకు మెరుగైన ప్రదేశంగా మార్చడంలో సాయపడతాయని పేర్కొంది. తన వంటి వేలాది రోబోలు ప్రపంచంలో మార్పు తీసుకువచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపింది.
Read More :
Ameesha Patel | ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అమీషా పటేల్.. హోమో సెక్స్, గే కంటెంట్ అంటూ..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI tools
- conference
- creators
- Robots
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

