న్యూఢిల్లీ : భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ 3 ధరలు భారీగా పెరిగాయని పలు రిపోర్ట్స్ వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో ఐఫోన్ ఎస్ఈ 3 లాంఛ్ కాగా, 64జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ రూ 43,900కు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇక 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వరుసగా రూ 48,900, రూ 58,900 ధరతో లాంఛ్ అయ్యాయి. అయితే ఈ మూడు స్టోరేజ్ మోడల్స్ ధరలు భారత్‌లో ఇప్పుడు మరింత భారమయ్యాయని వార్తలు రాగా నెల కిందట ఐఫోన్ 14 లాంఛ్ అయిన సమయంలోనే వీటి ధరలు పెరిగాయని, తాజాగా ఎలాంటి ధరల పెంపు చోటుచేసుకోలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
నెలరోజుల కిందటే 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 49,900కు పెరగ్గా, ఇతర రెండు మోడల్స్ ధరలు వరుసగా రూ 54,900 రూ. 64,900కు ఎగబాకాయి. అయితే యూజర్లు ఇప్పటికీ ఐఫోన్ ఎస్ఈ 3ని డిస్కౌంట్‌పై సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై యాపిల్ రూ 7000 క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ ఆఫర్ చేస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ 3 256జీబీ స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌పై రూ 52,990కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 కూడా ఐఫోన్ ఎస్ఈ 3 తరహాలోనే ఏ15 బయోనిక్ చిప్సెట్ కలిగిఉండటంతో పాటు డ్యాయర్ రియర్ కెమెరా సెటప్‌తో మెరుగైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేసే వెసులుబాటు ఉండటంతో ఐఫోన్ 13వైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.