Redmi Note 13 5G series | జనవరి 4న స్టన్నింగ్ డిజైన్‌తో రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ గ్రాండ్ ఎంట్రీ : ధర ఎంతంటే..!
రాబోయే వారాల్లో పలు స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా హాట్ డివైజ్ రెడ్మి నోట్ 13 5జీ (Redmi Note 13 5G series) కూడా లైనప్‌లో ఉంది.
న్యూఢిల్లీ : రాబోయే వారాల్లో పలు స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా హాట్ డివైజ్ రెడ్మి నోట్ 13 5జీ (Redmi Note 13 5G series) కూడా లైనప్‌లో ఉంది. రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ వచ్చే ఏడాది జనవరి 4న లాంఛ్ కానుందని కంపెనీ ఇప్పటికే టీజర్లో వెల్లడించింది. రెడ్మి అప్‌కమింగ్ సిరీస్‌లో రెడ్మి నోట్ 13, రెడ్మి నోట్ 13 ప్రొ, రెడ్మి నోట్ 13 ప్రొ+ ఉండనున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్మి నోట్ 13 ప్రొ+ అధునాతన డిజైన్‌తో, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుందని టీజర్లో హింట్ ఇచ్చారు.
ఇక చైనా ధరలకు అనుగుణంగా రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ రూ. 13,000 నుంచి రూ. 22,000 మధ్య ఉంటుందని అంచనా. గంభీరంగా ఉన్న సముద్రంపై తేలియాడుతూ నోట్ 13 వర్డ్‌ను అధికారిక టీజర్లో చూపిన షియామి రెడ్మి నోట్ 13 ప్రొ+ డిజైన్ వెల్లడిస్తూ మరో టీజర్‌ను వదిలింది. ఈ టీజర్లో అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ పాక్షికంగా నీట మునిగినట్టు చూపారు. న్యూ టీజర్లో రెడ్మి నోట్ 13ప్రొ+ స్టైలిష్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. బ్యాక్ ప్యానెల్లో అధిక భాగం లావెండర్ కలర్లో ఆకట్టుకోగా, కెమెరా మాడ్యూల్ పార్ట్ లైట్ బ్లూ, టాప్ రైట్ కార్నర్ లైటర్ బ్లూ కలర్‌తో రెడ్మి బ్రాండింగ్‌తో కట్టిపడేస్తుంది.
కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వేస్తే రెడ్మి నోట్ 13 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 100 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో రానుండగా, ప్రొ మోడల్స్ 200ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో ఆకట్టుకోనున్నాయి. మూడు వేరియంట్స్ ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాతో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Read More :
Generative AI phones | ఏఐ ఫీచర్స్‌తో రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

