realme P3 Lite 5G | చవక ధరకే అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త 5జి స్మార్ట్ ఫోన్..!
ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.
realme P3 Lite 5G | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే రియల్‌మి కూడా ఇదే కోవలో మరో నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మి పి3 లైట్ 5జి పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. రియల్‌మికి చెందిన అత్యంత చవకైన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా చాలా తక్కువగా ఉండడం విశేషం. రియల్‌మి పి3 లైట్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 12జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. ఇంత తక్కువ ధర కలిగిన ఈ ఫోన్లో డస్ట, వాటర్ ప్రొటెక్షన్ ఉండడం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ ప్రకారం ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
రెండు వేరియెంట్లు..
ఈ ఫోన్లో 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. స్టోరేజ్‌ను మెమొరీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. అల్ట్రా లినియర్ బాటమ్ పోర్టెడ్ స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. కనుక సౌండ్ క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
రియల్‌మి పి3 లైట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను పర్పుల్ బ్లాసమ్, మిడ్ నైట్ లిల్లీ, లిల్ల వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499గా ఉంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్‌ను అందిస్తున్నారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌లో, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో సెప్టెంబర్ 22 నుంచి విక్రయించనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

