realme NARZO 80 Lite 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే..!
భారీబ్యాటరీతో, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే రియల్‌మి కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నార్జో 80 లైట్ 5జి పేరిట రియల్ మి ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లేటెస్ట్గా విడుదల చేసింది.
realme NARZO 80 Lite 5G | భారీబ్యాటరీతో, ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే రియల్‌మి కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నార్జో 80 లైట్ 5జి పేరిట రియల్ మి ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లేటెస్ట్గా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రియల్‌మి నార్జో 80 లైట్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 12 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ..
ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో మొమొరీ కార్డు వేయడం ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్, ఒక మైక్రో ఎస్డీ కార్డును వేసుకునేందుకు మాత్రమే వీలు కలుగుతుంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్..
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు పక్క భాగంలో అమర్చారు. ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఈ ఫోన్లో ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా పనిచేస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ధర వివరాలు..
రియల్‌మి నార్జో 80 లైట్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499 ఉండగా దీనిపై రూ.500 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ ధర రూ.9,999 అవుతుంది. జూన్ 23వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499 ఉండగా, దీనిపై రూ.700 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.10,799 అవుతుంది. ఈ ఆఫర్‌ను కూడా జూన్ 23వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఫోన్‌ను వినియోగదారులు అమెజాన్ సైట్లో కొనుగోలు చేయవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

