Google Job | నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఘనత : గూగుల్‌లో రూ. 50 లక్షల వేతన ప్యాకేజ్‌తో జాబ్!
కండ్లు చెదిరే వేతనంతో దిగ్గజ కంపెనీల్లో కొలువులు కొట్టాలంటే ఐఐటీల్లో చదవాలి..ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలనే వాదనలను తోసిపుచ్చుతూ ఓ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సెర్చింజన్ దిగ్గజంలో (Google Job) చోటు సంపాదించాడు.
ముంబై : కండ్లు చెదిరే వేతనంతో దిగ్గజ కంపెనీల్లో కొలువులు కొట్టాలంటే ఐఐటీల్లో చదవాలి..ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలనే వాదనలను తోసిపుచ్చుతూ ఓ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సెర్చింజన్ దిగ్గజంలో (Google Job) చోటు సంపాదించాడు. పుణేలోని ఎంఐటీ-వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్ధి హర్షల్ జుకర్‌కు గూగుల్‌లో రూ. 50 లక్షల వేతన ప్యాకేజ్‌తో జాబ్ లభించింది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన హర్షల్‌కు సంప్రదాయ కెరీర్ రూట్లకు భిన్నంగా బ్లాక్టైన్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉండటంతో అదే స్ట్రీమ్‌లో ఎంఎస్సీ పూర్తిచేశాడు.
పట్టుదల, అలుపెరుగని కృషి, నైపుణ్యాలు ఉంటే ఎంచుకున్న ఏ రంగంలోనైనా అద్భుత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని హర్షుల్ ఉదంతం యువతకు స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీలో తాను కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా, రోజురోజుకు మారే టెక్నాలజీపై పట్టు పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదును పెట్టడం అవసరమని గుర్తించానని హర్షుల్ చెప్పుకొచ్చారు. సిలబస్‌కు వెలుపల అవగాహన పెంచుకునేందుకు సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవరుచుకున్నానని అన్నారు.
పుణేలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూలో బ్లాక్‌చైన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేసే సమయంలో పరిశ్రమ నిపుణుల నుంచి మౌలికాంశాలను నేర్చుకున్నానని, భారీ డేటాసెట్స్పై పనిచేసే అవకాశం లభించిందని, స్టాటిస్టికల్ అల్గారిథమ్స్‌ను విశ్లేషించే వెసులుబాటు కలిగిందని హర్షుల్ గుర్తుచేసుకున్నారు. వినూత్న ఉత్పత్తులకు పేరొందిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే అవకాశం వస్తుందని తానెన్నడూ ఊహించలేదని హర్షుల్ సంతోషం వ్యక్తం చేశారు. గూగుల్‌లో అద్భుత ప్రయాణం కోసం, ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫామ్‌పై సాంకేతిక రంగంలో సేవలు అందించడం కోసం తాను ఉద్వేగంతో ఎదురుచూస్తున్నానని హర్షుల్ చెప్పుకొచ్చారు.
Read More :
Indian Student | భారత్ ను వదిలి రావడం నా కల అని ట్రోల్స్ కు గురైంది.. బంపర్ ఆఫర్ కొట్టేసింది
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

