Poco M4 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ పోకో నుంచి తాజాగా ఎం4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. భారత్‌లో ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేశారు. రూ.14,999కే అందుబాటులో ఉండే ఈ ఫోన్ 4జీ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇదివరకే ఇదే మోడల్లో 5జీ ఫోన్‌ను కూడా పోకో రిలీజ్ చేసింది. ఈఫోన్ ఏఎంవోఎల్ఈడీ ప్యానెల్, 4జీ చిప్, స్టీరియో స్పీకర్స్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఐపీ53 రేటింగ్ లాంటి ఫీచర్లతో లాంచ్ అయింది.
6 జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉండగా.. 6 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గా ఉంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. మార్చి 7 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుంది. 6.43 ఇంచ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, 90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 64 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.