పొకో M3 ప్రొ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..ఫీచర్లివే!

Poco M3 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పొకో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. పొకో M3 ప్రొ పేరుతో లాంచ్ అయిన ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ, 6.5 అంగుళాల FHD+ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. పొకో ఎం3 ప్రొ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 14 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫస్ట్‌సేల్‌లో రెండు వేరియంట్లపై 500 డిస్కౌంట్ ఇస్తున్నట్లు పొకో ఇండియా పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. స్పెషల్ సేల్ జూన్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
పొకో M3 ప్రొ 5G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.50 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+2+2 మెగా పిక్సెల్
ర్యామ్: 4జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- 5G
- 5g smart phone
- Poco
- POCO M3 PRO
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

