న్యూఢిల్లీ : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2కు కొనసాగింపుగా వచ్చే ఏడాది ఆరంభంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లాంఛ్ కానుంది. వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రకటన రాకముందే ఈ హాట్ డివైజ్ ఫీచర్లపై ఆన్లైన్లో లీకులు వెల్లడయ్యాయి. న్యూ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 వెనుకభాగంలో మూడు కెమెరాలు ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుందని 91మొబైల్స్ వెల్లడించింది. వన్‌ప్లస్ ఎక్స్ స్ఫూర్తితో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 డిజైన్ ఉంటుందని ఈ రిపోర్ట్ పేర్కొంది. వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో రానుందని అంచనా.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్ 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని, ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది.