OnePlus Nord 3 | దేశీ మార్కెట్లోకి త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 ఎంట్రీ..ధర ఎంతంటే..!
నెక్ట్స్ నార్డ్ ఫోన్ టీజర్‌ను కంపెనీ లాంఛ్ చేయడంతో వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3) త్వరలో భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 లాంఛ్ ఈవెంట్ త్వరలో ఉంటుందని లీకులు వెల్లడవుతున్నాయి.
న్యూఢిల్లీ : నెక్ట్స్ నార్డ్ ఫోన్ టీజర్‌ను కంపెనీ లాంఛ్ చేయడంతో వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3) త్వరలో భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 లాంఛ్ ఈవెంట్ త్వరలో ఉంటుందని లీకులు వెల్లడవుతున్నాయి. ది ల్యాబ్ క్యాంపెయిన్‌తో నెక్ట్స్ నార్డ్ ఫోన్ లాంఛ్ టీజర్‌ను బ్రాండ్ ప్రమోట్ చేస్తోంది. వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరంలో ఈ క్యాంపెయిన్ రన్ అవుతోంది. ఇక ఈ హాట్ డివైజ్ అధికారిక లాంఛ్ డేట్‌ను కంపెనీ ఇప్పటివరకూ వెల్లడించలేదు. టీజర్ రిలీజ్ కావడంతో రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ నార్డ్ 3 మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు.
అప్‌కమింగ్ నార్డ్ ప్రోడక్ట్‌ను రివ్యూ చేసేందుకు తాము ఆరుగురు రివ్యూయర్లను సెలెక్ట్ చేస్తామని, వారికి ముందుగా ఈ డివైజ్‌ను చూసి, అనుభూతి చెందడంతో పాటు రివ్యూ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తామని క్యాంపెయిన్‌లో వన్‌ప్లస్ పేర్కొంది. అప్‌కమింగ్ వన్‌ప్లస్ నార్డ్ 3 భారత్‌లో రూ. 30,000లోపు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 3 1.5కే రిజల్యూషన్ డిస్ప్లేతో అంటే 6.74 ఇంచ్ సైజ్‌లో కస్టమర్ల ముందుకు రానుంది.
నార్డ్ సిరీస్ ఫోన్లలో ఉపయోగించే అమోల్డ్ డిస్ప్లేను నార్డ్ 3లోనూ కంపెనీ కంటిన్యూ చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 3 మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగిఉండే ఈ డివైజ్ వెనుక భాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ముందుభాగంలో ఈ 5జీ ఫోన్ 16ఎంపీ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 అండ్రాయిడ్ 13 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వన్‌ప్లస్ నార్డ్ 3 కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read More
Samsung Galaxy Z Flip 5 | శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5, వాచ్ 6 సిరీస్ కీలక ఫీచర్లివే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

