న్యూఢిల్లీ : వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌ను మే 17న లాంఛ్ చేసేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేపట్టింది. ఫాస్ట్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌పై వన్‌ప్లస్ ఫోకస్ పెట్టింది. ఒన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లను లాంఛ్‌కు ముందు కంపెనీ వెల్లడించింది.
గేమర్స్‌ను ఆకట్టుకునేలా 120హెచ్జడ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లేను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగిఉంటుంది. వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ఆకట్టుకోనుంది.
వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ 4890ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 65డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, వెనుక భాగంలో సెల్ఫీల కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కలిగి ఉంటుంది.