న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ ఈనెల 27న లాంఛ్ కానుండగా లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను కంపెనీ టీజర్లో రివీల్ చేసింది. టీజర్లో వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని వెల్లడైంది. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లౌ ట్విట్టర్లో వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ టీజర్‌ను షేర్ చేశారు. వన్‌ప్లస్ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో బ్లూ పైప్‌లైన్స్ కనిపించగా నథింగ్ ఫోన్ 1 బ్యాక్ ప్యానెల్‌పై ఎల్ఈడీ లైట్ల తరహాలో ఇవి కలర్ ఛేంజింగ్ ప్యాట్రన్‌లో ఉండనున్నాయి.
ఈ నెల ఆరంభంలో క్లౌడ్ 11 ఈవెంట్లో వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ గురించి వన్‌ప్లస్ తొలిసారిగా వెల్లడించింది. వన్‌ప్లస్ 8టీ కాన్సెప్ట్ తరహాలో ఎక్ట్సీరియర్ డిజైన్‌పై ఫోకస్ పెడుతూ వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్‌ను కంపెనీ కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఇక స్మార్ట్‌ఫోన్ తేలికపాటి బరువుతో ఆకట్టుకునేలా ఎక్ట్సీరియర్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారుచేసినట్టు టీజర్ హైలైట్ చేసింది. ఇక వన్‌ప్లస్ 11 రెగ్యులర్ డివైజ్‌తో పోలిస్తే వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ మెరుగైన కెమెరా ఫీచర్లను కలిగిఉంటుంది.
రెగ్యులర్ వెర్షన్లో రియర్ కెమెరా సిస్టమ్ కోసం వన్‌ప్లస్ హాసిల్బాల్డ్తో చేతులు కలిపింది. ఇక వన్‌ప్లస్ 11 భారత్‌లో రెండు వేరియంట్లు, కలర్స్‌లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో కూడిన బేస్ మోడల్ రూ. 56,999 కాగా, టాప్ మోడల్ రూ. 61,999కి లభిస్తుంది. వన్‌ప్లస్ 11 రెగ్యులర్ వెర్షన్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగిఉంది.