Nothing Phone 2 | భారత్‌లో నథింగ్ ఫోన్ 2 తయారీ..కీలక ఫీచర్ల వెల్లడి
భారత్‌లో నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) తయారీ చేపట్టనున్నట్టు కంపెనీ అధికారికంగా నిర్ధారించింది. మార్కెట్ డిమాండ్స్‌కు అనుగుణంగా అప్‌కమింగ్ 5జీ ఫోన్ భారత్‌లో తయారవుతుందని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : భారత్‌లో నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) తయారీ చేపట్టనున్నట్టు కంపెనీ అధికారికంగా నిర్ధారించింది. మార్కెట్ డిమాండ్స్‌కు అనుగుణంగా అప్‌కమింగ్ 5జీ ఫోన్ భారత్‌లో తయారవుతుందని స్పష్టం చేసింది. ఇక జులైలో నథింగ్ ఫోన్ 2 భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంఛ్ కానుండగా, లాంఛ్‌కు ముందు ఈ హాట్ డివైజ్ కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. నథింగ్ ఫోన్ 1 భారత్ వెలుపల తయారుకాగా, నథింగ్ ఫోన్ 2 భారత్‌లో తయారీ చేపట్టి పలు మార్కెట్లకు తరలిస్తారు.
భారత్‌లో నథింగ్ ఫోన్ 2 అసెంబ్లింగ్ చేపట్టనందున ఈ హాట్ డివైజ్ ధర చవకగా అందుబాటులో ఉండదని చెబుతున్నారు. నథింగ్ ఫోన్ 2 ధర భారత్‌లో రూ. 40,000లోపు ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ స్మార్ట్ఫోన్లు ఐకానిక్ ట్రాన్స్పరెంట్ డిజైన్‌కు పేరొందాయని, ఈ డిజైన్స్ కోసం హైటెక్ తయారీ ప్రక్రియలు, ప్రెసిషన్ ఇంజనీరింగ్ అవసరమని ఇది భారత్‌లో స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుందని నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ తెలిపారు.
నథింగ్ ఫోన్ 2 భారత్‌లో తయారవుతుందని తాము సగర్వంగా ప్రకటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నథింగ్ ఫోన్ 2 బ్యాటరీ, డిస్ప్లే, చిప్సెట్ సహా పలు ఇతర వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ప్రీమియం 5జీ ఫోన్ భారీ డిస్ప్లేతో క్వాల్‌కాం ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
Read More
Microsoft survey | ఏఐతో ఉద్యోగాలకు ఎసరు : న్యూ టెక్నాలజీపై 74 శాతం దేశీ ఉద్యోగుల్లో గుబులు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

