Ok Google : ఇక నుంచి ఓకే గూగుల్, హేయ్ గూగుల్ అనాల్సిన పనిలేదు
ఇక నుంచి ఓకే గూగుల్, హేయ్ గూగుల్ అనాల్సిన పనిలేదు | స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఈ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. ఓకే గూగుల్, హేయ్ గూగుల్ అంటూ గూగుల్ అసిస్టెంట్‌ను అడగగానే
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఈ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. ఓకే గూగుల్, హేయ్ గూగుల్ అంటూ గూగుల్ అసిస్టెంట్‌ను అడగగానే.. మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది గూగుల్. కేవలం వాయిస్ కమాండ్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుంది.

గూగుల్ అసిస్టెంట్‌తో మాట్లాడాలంటే ముందు ఓకే గూగుల్ అని కానీ.. హేయ్ గూగుల్ అని కానీ అనాల్సి ఉంటుంది. అప్పుడే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అయి.. కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. అయితే.. త్వరలనే ఓకే గూగుల్ లేదా హేయ్ గూగుల్ అని అనాల్సిన అవసరం లేకుండా గూగుల్ అసిస్టెంట్ ఆటోమెటిక్‌గా యాక్టివ్‌గా ఉండేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది.

త్వరలోనే గూగుల్ అసిస్టెంట్‌ను ఎటువంటి కమాండ్స్ ఇవ్వకున్నా కూడా యాక్టివేట్ అయ్యేలా డెవలప్ చేస్తున్నారు. త్వరలోనే గూగుల్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ఫోన్లలో ఈ ఆప్షన్‌ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12లో కూడా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందట.

ఈ ఫీచర్ ద్వారా.. అలారం ఆఫ్ చేయాలన్నా.. టైమర్ ఆఫ్ చేయాలన్నా.. ఓకే గూగుల్ అనకుండానే డైరెక్ట్‌గా కమాండ్ ఇచ్చి అలారం ఆఫ్ చేయొచ్చు. ప్రస్తుతం కూడా ఒక్కసారి హేయ్ గూగుల్ అని చెప్పి.. తర్వాత ఆ కమాండ్ చెప్పకున్నా.. గూగుల్ అసిస్టెంట్ యూజర్ వాయిస్‌ను రికగ్నైజ్ చేసి కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇక మీదట.. అసలు ఓకే గూగుల్ అనాల్సిన పనిలేకుండానే డైరెక్ట్‌గా యూజర్ కమాండ్‌కు గూగుల్ అసిస్టెంట్ రెస్పాండ్ అయ్యేలా ఫీచర్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతానికైతే.. ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్లలో రానుందట. ఆ తర్వాత మిగితా స్మార్ట్ఫోన్లలను తీసుకువస్తారని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
JioPhone Next 4G : అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ వచ్చేసింది
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

