న్యూయార్క్ : న్యూయార్క్ నుంచి లండన్‌కు కేవలం 90 నిమిషాల్లో చేరుకునే నాసా (NASA) విలక్షణ సూపర్సోనిక్ విమానం త్వరలో వాస్తవరూపు దాల్చనుంది. హై స్పీడ్ స్ట్రేటజీతో న్యూయార్క్-లండన్ ఫ్లైట్స్ గమ్యస్ధానానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గుతుందని నాసా ప్రకటించింది. నాసా ఎక్స్-59 సూపర్సోనిక్ విమానం పురోగతి కొనసాగుతోంది.
కాలిఫోర్నియాలోని పామ్డేల్లోని లాక్‌హీడ్ మార్టిన్ స్కంక్ వర్క్స్ ఫెసిలిటీ వద్ద పెయింట్ బార్న్‌కు ఇటీవల ఎక్స్-59 వెళ్లింది. మిషన్‌లో ఈ కీలక దశకు చేరుకోవడం పట్ల తాము ఉద్వేగంతో ఉన్నామని, తమ విజన్ నిజం కాబోతున్న క్షణాల పట్ల ఎగ్జైటింగ్‌గా వేచిచూస్తున్నామని లోబూమ్ ఫ్లైట్ డిమాన్స్ట్రేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ క్యాథీ బామ్ పేర్కొన్నారు.
ఎక్స్-59కు రాబోయే ఏడాది అద్భుతమైన సందర్భమని, ఎయిర్‌క్రాప్ట్ చివరిగా స్పెక్టాక్యులర్ మిషన్‌ను అందుకోనుందని అన్నారు. నాసా క్వెస్ట్ మిషన్‌లో భాగంగా ప్రయోగాత్మక విమానంగా ఎక్స్-59 ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనుంది. సాధారణ సోనిక్ బూమ్ ధ్వనిని సోనిక్ థంప్‌గా తగ్గించేటప్పుడు ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించేలా ఈ విమానాన్ని డిజైన్ చేశారు.
Read More :
GPS Signal lost | మిడిల్ ఈస్ట్‌లో జీపీఎస్ సిగ్నల్స్ కోల్పోతున్న విమానాలు.. డీజీసీఏ ఆందోళన