Plastic | జ్యూరిచ్, ఫిబ్రవరి 25: తుప్పు పట్టడం ప్రతి నిర్మాణానికీ ఉండే సమస్యే. అయితే తప్పు పట్టనివ్వని ప్లాస్టిక్‌ను జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ ప్లాస్టిక్‌ను పాలీ(ఫెనిలీన్ మెథిలీన్) లేదా క్లుప్తంగా పీపీఎం అని పిలుస్తారు. దీన్ని దేని ఉపరితలంపైనా అయినా పూస్తే గట్టి పడి, తుప్పు పట్టడాన్ని నిరోధిస్తుంది. ఇది లోహాలను (ముఖ్యంగా అల్యూమినియం) కూడా తుప్పు పట్టకుండా కాపాడగలుగుతుందని, ఈ ప్లాస్టిక్‌ను పునర్వినియోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు పాలిమర్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.