Vodafone Layoffs | 11,000 మంది ఉద్యోగులపై వొడాఫోన్ వేటు.. మాస్ లేఆఫ్స్ ప్రకటించిన టెలికాం దిగ్గజం
టెలికాం దిగ్గజం వొడాఫోన్ (Vodafone Layoffs) రాబోయే మూడేండ్లలో 11,000 ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం వొడాఫోన్ (Vodafone Layoffs) రాబోయే మూడేండ్లలో 11,000 ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రాబడిలో వృద్ధి కొరవడుతుందనే అంచనాతో లేఆఫ్స్ దిశగా నూతన సీఈవో మార్గెరిట డెలా వలె కసరత్తు సాగిస్తున్నారు. తమ వాణిజ్య వేగాన్ని అందుకుని, వనరుల సన్నద్ధత కోసం కంపెనీని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని నూతన సీఈవో చెప్పుకొచ్చారు.
తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కస్టమర్లు, నిరాడంబరంగా ఉంటూ మెరుగైన వృద్ధి రేటే తన ప్రాధాన్యతలని ఆమె వివరించారు. మార్కెట్లో పోటీతత్వానికి దీటుగా నిలబడేందుకు సంస్ధను సరళతరం చేస్తామని, కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు అనుగుణంగా వనరులను తిరిగి కేటాయిస్తామని చెప్పారు.
ఇక రాబోయే మూడేండ్లలో 11,000 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు కంపెనీ ప్రాధాన్యతలకు అనుగుణంగా పలు చర్యలు చేపడతారు. కాగా కంపెనీ షేర్ ధరల పతనంతో గత ఏడాది డిసెంబర్లో వొడాఫోన్ సీఈవో నిక్ రీడ్ పదవి నుంచి వైదొలిగారు. మరోవైపు వొడాఫోన్‌లో మాస్ లేఆఫ్స్ టెలికాం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.
Read More
Amazon Layoffs | అమెజాన్‌లో 9 వేల మందిపై వేటు.. భారత్‌లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- layoffs
- telecom gaint
- Vodafone
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

