షియోమీ MI 11 లైట్ వచ్చేసింది!

Mi 11 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను మంగళవారం భారత్‌లో ఆవిష్కరించింది. MI 11 లైట్ పేరుతో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 157 గ్రాముల బరువు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G చిప్సెట్, 4,250 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎంఐ 11 లైట్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .21,999 కాగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ టస్కానీ కోరల్, వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ కలర్లలో లభిస్తుంది. ఎంఐ 11 లైట్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ .1, 500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ.1,500 ఇన్స్టాంట్ తగ్గింపు కూడా లభిస్తుంది. జూన్ 25వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో ప్రీ-ఆర్డర్ కోసం ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. జూన్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి కొత్త ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
షియోమీ Mi 11 లైట్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8+5 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4250mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

