Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ వెనుక ఉన్న హీరోలు వీళ్లే!
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రాజెక్టు రూపకల్పనలో ఎన్నో బృందాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాయి. దీని రూపకల్పన వెనుక నాలుగేళ్ల కృషి ఉంది. దేశమంతా కొవిడ్-19తో అల్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి సుమారు వెయ్యిమంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
Chandrayaan-3 | న్యూఢిల్లీ ;చంద్రయాన్-3 ప్రాజెక్టు రూపకల్పనలో ఎన్నో బృందాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాయి. దీని రూపకల్పన వెనుక నాలుగేళ్ల కృషి ఉంది. దేశమంతా కొవిడ్-19తో అల్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి సుమారు వెయ్యిమంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ప్రాజెక్టు రూపకల్పనలో కృషి చేసిన ప్రముఖుల వివరాలను పరిశీలిద్దాం.

ఎస్ సోమనాథ్, ఇస్రో చైర్మన్
చంద్రయాన్-3ని కక్ష్యలోకి తీసుకెళ్లిన బాహుబలి రాకెట్ లేదా లాంచ్ వెహికల్ మార్క్-3 డిజైన్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. 2022లో ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సోమనాథ్.. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను సమన్వయపరిచి వారినుంచి సరైన ఫలితాలను రాబట్టారు. చంద్రయాన్-3 గగనతలంలోకి ప్రయోగించే ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి పరీక్షలు జరిపి పంపాల్సిన గురుతర బాధ్యత సోమనాథ్పైనే ఉంది. దానిని ఆయన నూరు శాతం విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్రీ విభాగానికి చీఫ్‌గా కూడా వ్యవహరించిన సోమనాథ్ మనదేశ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ మిషన్‌తో పాటు సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1 పనులను పర్యవేక్షిస్తున్నారు. గగన్‌యాన్ కార్యక్రమం చేపట్టక ముందు ఆయన కీలకమైన హ్యూమన్ ైఫ్టెట్ సెంటర్ మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు. లాంచ్ వెహికల్ మార్క్-3ను ఆయన నేతృత్వంలో నూరు శాతం విజయవంతంగా ప్రయోగించి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐఐటీ, బెంగళూరు నుంచి ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చదివిన ఆయన సంస్కృతం కూడా చదవగలరు. అలాగే యానం అనే సంస్కృత సినిమాలో ఆయన నటించారు. చిన్నచిన్న కథలు కూడా రాశారు. సోమనాథ్ అంటే ‘చంద్రుని దేవుడు’ అని అర్ధం.

వీరముత్తువేల్ చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్
జాబిల్లిపై తమదైన ముద్ర వేయాలన్న మొక్కవోని సంకల్పంతో వీరముత్తువేల్ గత నాలుగు ఏండ్లుగా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. చెన్నైలో టెక్నాలజీలో మాస్టర్స్ చేసిన ఈయన చంద్రయాన్-2, మంగళ్యాన్ ప్రాజెక్టులలో కూడా కీలక భూమిక పోషించారు. 2019లో ల్యాండర్ విక్రమ్ వైఫల్యం తర్వాత లోపరహితంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 మిషన్ రూపకల్పనకు ఎంతో కృషి చేశారు.

వి.నారాయణన్ డైరెక్టర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, తిరువనంతపురం
లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్ల రూపకల్పనలో స్పెషలిస్టు అయిన వి.నారాయణన్ తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడానికి అవసరమైన థ్రస్టర్స్‌ను ఈయన నేతృత్వంలోని బృందమే అభివృద్ధి చేసింది. ఐఐటి, ఖరగ్‌పూర్‌లో చదివిన నారాయణన్ క్రయోజనిక్ ఇంజిన్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచారు. ఇస్రో తయారు చేసిన చంద్రయాన్-3, లాంచ్ వెహికల్ మార్క్ 2 సహా చాలా రాకెట్ల తయారీలో తనదైన ముద్ర వేశారు. అలాగే చంద్రయాన్-3లో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ డైరెక్టర్ బీఎన్ రామకృష్ణ కూడా తనదైన రీతిలో విశిష్ట సేవలు అందించారు.

కల్పన కె, ఇంజనీర్
ఉపగ్రహాల తయారీకి తన జీవితాన్ని అంకితం చేసిన కల్పన ఇంజనీర్‌గా ఎనలేని సేవలందించారు. తొలుత ఐదేండ్ల పాటు శ్రీహరికోటలో పనిచేశారు. ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో ఆమె భాగస్వామి అయ్యారు. కొవిడ్ విపత్కర కాలంలో సైతం అలుపెరగకుండా సేవలందించినన ఈమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో సైతం పనిచేశారు.

ఎం వనిత డిప్యూటీ డైరెక్టర్ యూఆర్ రావు
శాటిలైట్ సెంటర్, బెంగళూరు చంద్రయాన్-2 ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.వనిత ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్. జాబిల్లికి సంబంధించిన ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. చంద్రయాన్-2లో పనిచేసిన ఈమె విశిష్ట అనుభవం చంద్రయాన్-3 రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది.

ఎం శంకరన్, డైరెక్టర్, యూఆర్ఎస్సీ
ఇస్రో పవర్ హౌస్‌గా పేరున్న ఎం.శంకరన్ ఫిజిక్స్‌లో మాస్టర్ చేశారు. ఉపగ్రహాలకు అవసరమైన పవర్ సిస్టమ్స్ తయారీలో దిట్ట. అంతేకాకుండా సౌర వ్యూహాలలో ఆరితేరిన శంకరన్ గత మూడు దశాబ్దాలుగా పలు ఉపగ్రహాల తయారీలో తనదైన ముద్ర వేశారు. చంద్రయాన్-1, మంగళ్యాన్, చంద్రయాన్-2 ఉపగ్రహాల తయారీలో ఈయన అపారమైన అనుభవం ఎంతో ఉపయోగపడింది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో కూడా ఆయన శాటిలైట్‌ను హాట్-కోల్డ్ టెస్టులు సమర్థంగా నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాబిల్లిపై ల్యాండర్‌ను పంపడానికి ఆయన సాక్షాత్తు జాబిల్లి నమూనాను తయారు చేసి ప్రయోగాలు నిర్వహించి విజయవంతం చేశారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

