Lenovo Tab | ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకే కాకుండా ఆండ్రాయిడ్ ట్యాబ్‌లకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ట్యాబ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వినోదం లేదా గేమ్స్, ఆఫీస్ పని, బిజినెస్ వంటి అవసరాల కోసం ట్యాబ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ ధరలోనే ఆకర్షణీమైన ఫీచర్లు కలిగిన ట్యాబ్‌లను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే కంపెనీలు కూడా అలాంటి ట్యాబ్‌లనే రూపొందించి విడుదల చేస్తున్నాయి. ఇక ఇదే కోవలో లెనోవో కూడా ఓ నూతన ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ పేరిట ఈ ట్యాబ్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్ ధర తక్కువగా ఉండడమే కాదు, ఇందులో ఆకట్టకునే ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఇందులో 10.1 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లే ఉండగా, మీడియాటెక్ హీలియో జి85 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 4జీ ఎల్టీఈ సదుపాయం కూడా ఉంది.
ఈ ట్యాబ్‌ను పూర్తిగా మెటాలిక్ డిజైన్‌తో రూపొందించారు. అందువల్ల బడ్జెట్ ట్యాబ్ అయినప్పటికీ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. డ్యుయల్ స్పీకర్లను ఈ ట్యాబ్‌కు అందిస్తున్నారు. డాల్బీ అట్మోస్ సదుపాయం కూడా ఉంది. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్‌తోపాటు 20 వాట్ల చార్జింగ్ అడాప్టర్‌ను కూడా అందిస్తున్నారు. 4జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు. దీనికి గాను 2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఇందులో ఇచ్చారు. 4జి సదుపాయం కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
లెనోవో ట్యాబ్ ను పోలార్ బ్లూ, లూనా గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.10,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.11,999గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఎల్టీఈ మోడల్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఈ ట్యాబ్‌ను లెనోవో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు.