Mobile Tracking | మొబైల్ పోగొట్టుకున్నారా.. నో ప్రాబ్లం.. సీఈఐఆర్ ఉంటే చాలు ట్రాకింగ్ ఈజీ..!
Mobile Tracking | మొబైల్ ఫోన్ పోయిందా.. నో ప్రాబ్లం.. ఐఎంఈఐ ఆధారంగా సీఈఐఆర్ లో నమోదు చేస్తే సరి.. ఆ ఫోన్ ఎవరి దగ్గర, ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ..
Mobile Tracking | ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిందే.. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ తరతమ బేధాల్లేకుండా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆయా స్మార్ట్ ఫోన్లో ఫీచర్లు, డిస్ప్లే.. కాంటాక్ట్ డిటైల్స్.. డేటా.. ఫొటోలు, బ్యాంకింగ్ అకౌంట్ డిటైల్స్ అన్నీ ఉంటాయి. అలా అన్ని అంశాల సమాచారం ఉన్న స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే కలిగే బాధ చెప్పనలవి కాదు.
ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ తో తెలుసుకోవచ్చు
అందులో ముఖ్యంగా డేటా.. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ లావాదేవీల డేటా గురించి ఆందోళన ఉంటుంది. ఫోన్ పోయిందంటే సర్వస్వమూ పోయినట్లేనన్నట్లు భావిస్తారు కొందరు. గతంలో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరికే అవకాశాలు చాలా తక్కువ.. కానీ ఇప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) పేరిట కేంద్ర టెలికం శాఖ (డాట్).. మొబైల్ యూజర్లకు మోడరన్ సేవలు వినియోగంలోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ వెతికి.. అది ఎక్కడ ఉందో తెలుసుకుని తెచ్చుకోవచ్చు. ఈ తరహా సేవలను 2019లోనే మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల మొబైల్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఐఎంఈఐ ఆధారంగా సీఈఐఆర్ సేవలు
స్మార్ట్ ఫోన్ ఐఎంఈఐ ఆధారంగా సీఈఐఆర్ పని చేస్తుంది. సీఈఐఆర్ కోసం దేశంలోని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు, మొబైల్ తయారీ సంస్థలు సంయుక్తంగా డీవోటీ యూజర్లకు సేవలందిస్తున్నాయి.
సీఈఐఆర్ వెబ్, మొబైల్ యాప్ వర్షన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్ వెబ్‌సైట్‌కి వెళ్లొచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌కెళ్లి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘నో యువర్ మొబైల్’ అనే పేరుతో మొబైల్ యాప్ వర్షన్ ఉంటుంది.
Kym Mobiletracking
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి
ముందుగా ఫోన్ పోయిన తర్వాత యూజర్.. సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ ప్రతి అందిన తర్వాత సీఈఐఆర్ పోర్టల్ తెరిస్తే.. బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్, అన్ బ్లాక్ పౌండ్ మొబైల్, చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో డివైజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో ఫోన్ నంబర్, ఐఎంఈఐ నంబర్, ఫోన్ బ్రాండ్ పేరు, మోడల్ తదితర వివరాలు నమోదు చేసి, మొబైల్ ఫోన్ కొనుగోలు రశీదు ఫొటో అప్లోడ్ చేయాలి.
అటుపై లాస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం, తేడీ, పోలీసు కంప్లయింట్ నంబర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రతి ఫొటో అప్లోడ్ చేయాలి.
పర్సనల్ డిటైల్స్ నమోదుతో రిక్వెస్ట్ ఐడీ
దీని తర్వాత మొబైల్ యూజర్ వ్యక్తిగత డిటైల్స్.. సదరు వ్యక్తి పేరు, అడ్రస్, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. అటుపై యూజర్ ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు రిక్వెస్ట్ ఐడీ నంబర్ వస్తుంది. భవిష్యత్‌లో కంప్లయింట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ రిక్వెస్ట్ ఐడీ నంబర్ ఉపకరిస్తుంది.
యూజర్ సమర్పించిన వివరాల ఆధారంగా సదరు మొబైల్ ఫోన నంబర్‌ను 24 గంటల్లో సీఈఐఆర్ బ్లాక్ చేస్తుంది. అటుపై ఆ ఫోన్ వివరాలను మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్లకు పంపుతుంది.
అలా సీఈఐఆర్ బ్లాక్ చేసిన మొబైల్ ఫోన్లో ఎవరు సిమ్ కార్డు వాడినా సీఈఐఆర్‌కు వెంటనే అలర్ట్ సందేశం వస్తుంది. ఈ మెసేజ్‌తో యూజర్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఏ ప్రాంతంలో ఉన్నదో తేలిగ్గా ఐడెంటిఫై చేయొచ్చు.
కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకున్నా ఇలా చెక్ చేసుకోవచ్చు
అలా కాకుండా పోగొట్టుకున్న వ్యక్తికే ఆ ఫోన్ దొరికితే వెంటనే యూజర్ సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి అన్‌బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ డిటైల్స్ ఇచ్చాక ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది.
కొత్త ఫోన్ గానీ, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కోవాలనుకున్న వారు కూడా తాము ఎంపిక చేసుకున్న ఫోన్ మోడల్, ఐఎంఈఐ నంబర్.. వెబ్ పోర్టల్ కేవైఎం సెక్షన్లో గానీ, మొబైల్ యాప్‌లో గానీ రిజిస్టర్ చేయడం ద్వారా గానీ, కేవైఎం < 15 అంకెల ఐఎంఈఐ నంబర్ < టైప్ చేసి 14422కి ఎస్ఎంఎస్ పంపి, ఫోన్ బ్లాక్ లిస్ట్‌లో ఉందా.. లేదా తెలుసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

