Jio Calender Month Validity | జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్.. అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్
ఈ రీచార్జ్ ప్లాన్ ప్రకారం.. సరిగ్గా నెల రోజుల పాటు అంటే క్యాలెంటర్ నెల వరకు అన్లిమిటెడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను
Jio Calender Month Validity | రిలయెన్స్ జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రారంభం అయింది. దీనికి జియో.. క్యాలెండర్ మంత్ వాలిడిటీ అనే పేరు పెట్టింది. ఈ రీచార్జ్ ప్లాన్ ప్రకారం.. సరిగ్గా నెల రోజుల పాటు అంటే క్యాలెంటర్ నెల వరకు అన్లిమిటెడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నారు. దీని కోసం కేవలం రూ.259 చెల్లిస్తే చాలు.
సాధారణంగా జియోలో రీచార్జ్ ప్లాన్స్ 28 రోజులకే ఉంటాయి. కానీ.. రూ.259తో క్యాలెండర్ నెలలో ఉండే రోజులకు ఈ ప్లాన్‌ను వర్తింపజేస్తారన్నమాట. ఉదాహరణకు ఏప్రిల్ 5న రూ.259తో రీచార్జ్ చేసుకుంటే.. మే 5 వరకు వాలిడిటీ ఉంటుంది. మే 5న మళ్లీ చేసుకుంటే.. జూన్ 5 వరకు ఉంటుంది.
ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 1.5 జీబీ డేటా, అల్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్స్ చేసుకోవచ్చు. రూ.259 ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ప్రతి నెల ఒకే రోజు యూజర్లు రీచార్జ్ చేసుకునేలా ఈ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఒకసారి ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ప్రతి నెల ఆ ప్లాన్ ఆటోమెటిక్‌గా రెన్యువల్ అవుతుంది. గత వారం జియో.. రూ.555, రూ.2999 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

