ఫిబ్రవరిలో మరోసారి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం చేపట్టనున్న ఇస్రో..!
ISRO | స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రెండో ప్రయోగాన్ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితమైన తేదిని
ISRO | స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రెండో ప్రయోగాన్ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితమైన తేదిని మాత్రం చెప్పలేనని, వచ్చే నెలలో టెస్ట్ ఫ్లైట్‌కు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఎస్ఎల్వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. గతేడాది ఆగస్ట్ 7న తొలిసారిగా ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించగా.. విఫలమైన విషయం తెలిసిందే.
దాంతో పాటు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS)-2, అజాదిశాట్ కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. అలాగే చంద్రుడిపైకి ల్యాండ్రోవర్ను పంపడంతో పాటు ఈ ఏడాది మార్స్, వీనస్‌లను సైంటిఫిక్ మిషన్లను పంపాలని యోచిస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక దాదాపు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. జూన్‌లో మిషన్‌ను ప్రారంభించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
ఈ సారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ ఉపగ్రహ ఆధారిత ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్-బ్రాడ్కాస్ట్ (ADS-B) రిసీవర్ సిస్టమ్‌ను సైతం పరీక్షించనున్నట్లు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఎస్ఎస్ఎల్వీ టెస్ట్ ఫ్లైట్‌లోనే ఏడీఎస్-బీ వ్యవస్థను పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

