iPhone : వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి సిమ్ కార్డు స్లాట్ లేని ఐఫోన్ మోడల్స్‌ను లాంఛ్ చేసేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేపట్టింది. 2023లో యాపిల్ లాంఛ్ చేసే ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌లో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉండబోదని బ్రెజిలియన్ వెబ్సైట్ బ్లాగ్ డూ ఇటీవల వెల్లడించగా మ్యాక్రూమర్స్ నుంచి తాజా రిపోర్ట్ వెల్లడైంది.
2022 సెప్టెంబర్ నుంచి యాపిల్ కేవలం ఈసిమ్తో కూడిన స్మార్ట్ఫోన్లనే లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టిందని ఈ నివేదిక పేర్కొంది. గతంలో పేర్కొన్నట్టు కొన్ని ఐఫోన్ 15 మోడళ్లతో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను యాపిల్ తొలగిస్తుందనే వార్తలు రాగా ఐఫోన్ 14 మోడళ్లతోనే ఈసిమ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచేలా రెండు ఈసిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేసేలా ఐఫోన్ మోడల్స్ అందుబాటులోకి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
సిమ్ కార్డ్ స్లాట్ తొలగిస్తే వాటర్ రెసిస్టెన్స్ కూడా మరింత మెరుగ్గా ఉండనుంది. వచ్చే ఏడాది ఐఫోన్ కోసం యాపిల్ క్యూఎల్‌సీ ఫ్లాష్ స్టోరేజ్‌ను అడాప్ట్ చేసుకుంటోంది. ఐఫోన్ న్యూ మోడల్స్‌లో 48ఎంపీ కెమెరా లెన్స్‌ను ప్రవేశపెడుతుండగా, 2023 ఐఫోన్ మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.