iPhone 15 | న్యూ నాచ్ డిజైన్‌తో రానున్న ఐఫోన్ 15
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న ఐఫోన్ 15పై ఎన్నో స్పెక్యులేషన్స్, లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ఐఫోన్ 15 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న ఐఫోన్ 15పై ఎన్నో స్పెక్యులేషన్స్, లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ఐఫోన్ 15 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. 9టూ5మ్యాక్ షేర్ చేసిన వివరాల ప్రకారం రెగ్యులర్ ఐఫోన్ 15 ముందుభాగంలో డైనమిక్ ఐలండ్ నాచ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఐఫోన్ 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్‌లో ప్రస్తుతం డైనమిక్ ఐలండ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

రెగ్యులర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 మ్యాక్స్‌లో డైనమిక్ ఐలండ్ రానుందని చెబుతున్నారు. డిస్ప్లేలో యాపిల్ లేటెస్ట్ ఇన్నోవేషన్‌గా డైనమిక్ ఐలండ్ ఫీచర్ ముందుకొచ్చింది. ఇతర నాచ్ డిజైన్ల తరహాలోనే ఓవల్ ఆకారంలో ఉండే ఈ డిస్ప్లేలో ఫ్రంట్ కెమరా, ఫేస్ ఐడీ సెన్సర్లు ఉంటాయి. స్క్రీన్ టాప్‌లో డెడ్ స్పేస్‌కు బదులుగా డైనమిక్ ఐలండ్ నోటిఫికేషన్స్, అలర్ట్స్, రియల్‌టైమ్ ఇన్ఫర్మేషన్ చూపుతుంది. ఇక లేటెస్ట్ సీఏడీ లీక్స్‌లో ఐఫోన్ 15 ఫొటోలు వెలుగుచూశాయి.
ఈ ఇమేజ్ను ఇటీవల మ్యాక్రూమర్స్ లీక్ చేసింది. రెగ్యులర్ ఐఫోన్ 15 మోడల్స్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరాలను కలిగిఉంటాయి. ఐఫోన్ ప్రొ మోడల్స్‌లో థర్డ్ కెమెరా, లైడర్ సెన్సర్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇక వెనుక భాగంలో యాపిల్ రెండు 12 ఎంపీ కెమెరా సెన్సర్లను కొనసాగిస్తుందా లేదా అనేది వేచిచూడాలి. ఐఫోన్ 15 మోడల్స్‌లో బ్యాటరీని యాపిల్ మెరుగుపరస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More :
ChatGPT | ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌తో హ్యాకర్ల గుప్పిట్లో యూజర్ల కీలక డేటా
Twitter Layoffs | మస్క్ మాటలకు అర్ధాలే వేరులే… : లేఆఫ్స్ లేవంటూనే మళ్లీ కొలువుల కోత..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- dynamic island
- iphone 15
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

