ChatGPT | ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌తో హ్యాకర్ల గుప్పిట్లో యూజర్ల కీలక డేటా
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) పాపులారిటీ పెరగడంతో యూజర్లను బురిడీ కొట్టించేందుకు హ్యాకర్లు ఈ అవకాశాన్ని పావుగా వాడుకుంటున్నారు.
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) పాపులారిటీ పెరగడంతో యూజర్లను బురిడీ కొట్టించేందుకు హ్యాకర్లు ఈ అవకాశాన్ని పావుగా వాడుకుంటున్నారు. కొత్త మాల్వేర్ ఉపయోగించి ఫేక్ చాట్‌జీపీటీ యాప్‌తో హ్యాకర్లు యూజర్ల ఇన్స్టాగ్రాం, జీమెయిల్ వివరాలను యాక్సెస్ చేస్తున్నారు. హ్యాకర్లు ఫేక్ చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి నకిలీ చాట్‌జీపీటీ యాప్ లింక్‌ను పొందుపరిచారని పరిశోధకులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. న్యూ మాల్వేర్తో కూడిన ఫేక్ చాట్‌జీపీటీ యాప్ యూజర్ల సోషల్ మీడియా వివరాల చోరీకి పాల్పడుతుందని కాస్పర్స్కైకి చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఫేక్ డెస్క్‌టాప్ యాప్ లింక్‌లను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వేదికలపై సర్క్యులేట్ చేస్తున్నారని బ్లాగ్‌పోస్ట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్ధ కాస్పర్‌స్కై యూజర్లను అప్రమత్తం చేసింది. ఈ లింక్‌తో కూడిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే బ్యాంకు ఖాతాలో 50 డాలర్లు క్రెడిట్ అవుతాయని మభ్యపెడుతున్నాయని కూడా వెల్లడించింది. అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సిస్టమ్‌లో మాల్వేర్ ఇన్స్టాల్ అవడంతో యూజర్ల డేటా చోరీకి గురవుతుందని పేర్కొంది.
న్యూ మాల్వేర్ను ఫోబోగా కంపెనీ గుర్తించింది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా యూజర్లు ఒకసారి లింక్‌ను క్లిక్ చేయగానే ఫేక్ వెబ్‌సైట్‌కు అది డైరెక్ట్ చేస్తుంది. యాప్‌ను డౌన్లోడ్ కోసం సెలెక్ట్ చేయగా ఎర్రర్ మెసేజ్ చూపితే బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్వేర్ ఫోబో ఇన్స్టాల్ అవుతుంది. ఈ మాల్వేర్ లాగిన్ వివరాలు సహా కీలక సమాచారాన్ని చోరీ చేసే ఉద్దేశంతో డిజైన్ చేయబడింది. హ్యాకర్లు కుకీస్‌ను యాక్సెస్ చేస్తే వారు ఫేస్బుక్, టిక్‌టాక్, గూగుల్ లాగిన్ వివరాలను సులభంగా చోరీ చేస్తారు. బిజినెస్ వివరాలు ఖాతా నుంచి ప్రకటనలకు ఎంత ఖర్చు చేశారు. ప్రస్తుత బ్యాలెన్స్ వంటి అదనపు సమాచారాన్ని వారు సంగ్రహిస్తారు.
Read More :
ChatGPT | 200 బుక్స్ రాసిన చాట్‌జీపీటీ : అమెజాన్ బుక్‌స్టోర్ లిస్టింగ్‌లో వెల్లడి
McKinsey layoffs | 2000 మందిని తొలగించనున్న మెకిన్సీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

