వాలెంటైన్స్ డే స్పెషల్ : ఐవీనస్ స్టోర్‌లో రూ. 37,900కు ఐఫోన్ 14
వాలెంటైన్స్ డే సందర్భంగా యాపిల్ అధీకృత సెల్లర్ ఐవీనస్ స్టోర్ ఆకర్షణీయ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : వాలెంటైన్స్ డే సందర్భంగా యాపిల్ అధీకృత సెల్లర్ ఐవీనస్ స్టోర్ ఆకర్షణీయ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది. రూ. 79,900 విలువైన ఐఫోన్ 14ను ఐవీనస్ స్టోర్‌లో రూ. 37,900కు సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఐఫోన్ 14పైనే కాకుండా ఐఫోన్ 14ప్లస్, ఐఫోన్ 13, ఎయిర్‌పాడ్స్ ప్రొ, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్స్‌పై కూడా ఐవీనస్ పలు డీల్స్, డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక ఐఫోన్ 14పై ఐవీనస్ రూ. 8000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా హెచ్డీఎఫ్సీ కార్డుదారులకు రూ. 4000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 22,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను స్టోర్ ఆఫర్ చేస్తోంది.
ఈ డీల్స్ అన్నీ వర్తించిన తర్వాత ఐఫోన్ 14 ధర రూ. 37,900కు దిగివస్తోంది. ఐఫోన్ 14ను రూ. 40,000లోపు దక్కించుకోవడం కంటే మెరుగైన డీల్ మరొకటి ఉండదు. యాపిల్ ఐఫోన్ 14 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో ఫేస్ ఐడీ సెన్సర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. ఐఫోన్ 14 అత్యాధునిక ఏ15 బయోనిక్ చిప్‌తో 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

