న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ అవుతుందని భావిస్తున్న ఐఫోన్ 14 సిరీస్ ధర ఎంత ఉంటుందనే దానిపై పలు అంచనాలు వెల్లడవుతున్నాయి. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్ ధర భారత్‌లో రూ 10,000 అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. అధిక దిగుమతి సుంకం, జీఎస్టీ, ఇతర చార్జీలు కలుపుకుని అమెరికన్ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ ధరలు అధికంగా ఉంటాయి.
ఉత్పత్తి, విడిపరికరాల వ్యయం పెరగడంతో ఈ వ్యయాన్ని నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఐఫోన్ 14 సిరీస్ ధరలను పెంచేందుకు యాపిల్ యోచిస్తుండటంతో అధిక ధరలను వెచ్చించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ అనలిస్ట్ డాన్ ఈవ్స్ సూచిస్తున్నారు.
ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 వంద డాలర్ల వరకూ (రూ. 10,000) అధికంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. మొత్తం సప్లయి చైన్ అంతటా ధరల పెరుగుదల కారణంగా యాపిల్ ఈ భారాన్ని వినియోగదారులకు మళ్లించడం ఖాయమని అన్నారు.