iPhone 14 | మెరుగైన బ్యాటరీ సామర్ధ్యంతో ముందుకొస్తున్న ఐఫోన్ 14 సిరీస్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 14 సిరీస్‌పై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 14 సిరీస్‌పై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐఫోన్ 14 ఫీచర్లపై పలు లీకులు వెల్లడవగా తాజాగా తొలిసారిగా బ్యాటరీ గురించిన సమాచారం లీకయింది. ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు భారీ బ్యాటరీ సామర్ధ్యంతో రానున్నాయని టిప్‌స్టర్ ష్రింప్యాపిల్ప్రొ తాజా నివేదిక వెల్లడించింది.

ఐఫోన్ 14 3279ఏంఏహెచ్ సెల్, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 4323ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుండగా ఐఫోన్ 14 ప్రొ 3200ఎంఏహెచ్ బ్యాటరీతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. తాజా లీక్ ప్రకారం ఇతర రెండు మోడల్స్ భారీ బ్యాటరీని కలిగిఉంటాయి. ఐఫోన్ 14 మ్యాక్స్ 4325ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 4323ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.
బ్యాటరీ లైఫ్‌తో ఐఫోన్ యూజర్లకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకున్న యాపిల్ ఐఫోన్ 13తో ఈ సమస్యను కొంత అధిగమించింది. ఐఫోన్ 14 మోడల్స్‌తో ఐఫోన్ 13 సిరీస్ కంటే మెరుగైన బ్యాటరీ సామర్ధ్యాన్ని ఆఫర్ చేసేందుకు యాపిల్ దృష్టి సారించింది. ఇక ఐఫోన్ 14 సిరీస్ యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో ఐఓఎస్ 16 అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ 13తో పోలిస్తే మెరుగైన కెమెరాలతో ఐఫోన్ 14 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

