iPhone 13 | రూ . 48,000కే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి
ఐఫోన్ 13ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు ఇదే సరైన అవకాశం. పండుగ సీజన్‌తో ఈకామర్స్ వెబ్సైట్లు పాత ఐఫోన్లపై క్రేజీ డీల్స్ ఇవ్వడంతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్లతో డ్రీం ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకునేందుకు వెసులుబాటు కలిగింది.
న్యూఢిల్లీ : ఐఫోన్ 13ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు ఇదే సరైన అవకాశం. పండుగ సీజన్‌తో ఈకామర్స్ వెబ్సైట్లు పాత ఐఫోన్లపై క్రేజీ డీల్స్ ఇవ్వడంతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్లతో డ్రీం ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకునేందుకు వెసులుబాటు కలిగింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 13ను ఫ్లిప్‌కార్ట్‌పై రూ 50,000 లోపు ధరకే దక్కించుకోవచ్చు. ఒరిజినల్ ధర కంటే రూ 10,000 తక్కువగా రూ 66,990కి ఐఫోన్ 13 లిస్టవగా ఆఫర్లకు అప్లయి చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్ రూ 50,000 లోపు అందుబాటులో ఉంటుంది.
పాత ఐఫోన్ 11. ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ రూ 18,500 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 13 ధర రూ 50,900కు దిగివస్తుంది. ఆపై ఎస్బీఐ క్రెడిట్‌కార్డు కలిగిన వారికి రూ 750 ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ 2000 ఆఫర్ అందుబాటులో ఉంది. కార్డు ద్వారా కొనుగోలు చేసే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఐఫోన్ 13 ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఏ15 బయోనిక్ హెక్సో కోర్ ప్రాసెసర్‌ను కలిగిఉంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ఐఓఎస్ 15 అవుటాఫ్ ది బాక్స్ ఓఎసపై రన్ అవుతుంది. 20డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 3240ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఐఫోన్ 13 కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

