I-Phone13@Huge Discount | ఆపిల్ ఐఫోన్13పై భారత్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం రూ.35,513లకే ఐఫోన్-13ను సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ మాపుల్ స్టోర్ నుంచి వచ్చే పలు ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే 128 జీబీ సామర్థ్యం గల ఐఫోన్-13 ధర తగ్గుతుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,990. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సమ్మర్ సేల్-2022లో రూ.66,900లకే ఐఫోన్-13 అందిస్తున్నట్లు ప్రకటించింది.
మాపుల్స్టోర్ వెబ్సైట్ ప్రకారం 128 జీబీ సామర్థ్యం గల ఆపిల్ ఐఫోన్-13 ఫోన్‌పై భారీగా రూ.44,477 డిస్కౌంట్ అందిస్తున్నది. దీని ప్రకారం ఐఫోన్-13 రూ.35,513లకు లభ్యం అవుతుంది. ఐఫోన్-13పై లభించే డిస్కౌంట్లలో మాపుల్ ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ రూ.10,387, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5000, బై బ్యాక్ వాల్యూ రూ.24 వేలు. అయితే, ఐఫోన్-11 గుడ్ కండీషన్లో ఉంటేనే ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అదీ కూడా మాపుల్ స్టోర్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఐఫోన్-13లో వివిధ రకాల మోడల్స్‌ను బట్టి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. మీరు ఒక ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే బైబ్యాక్ ఆఫర్ కోసం రీసెల్లర్ వెబ్సైట్లో మీ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం అమెజాన్ సమ్మర్ సేల్-2022 బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్-13లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే విత్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, ఆపిల్ ఏ15 బయోనిక్ చిప్, 12 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తదితర ఫీచర్లు ఉంటాయి.