Indian IT Giants Layoffs | ఇండియా ఐటీ జెయింట్స్కూ మాంద్యం ముప్పు.. ఫ్రెషర్స్‌కు ఇన్ఫీ పింక్ స్లిప్.. విప్రో కూడా!
Indian IT Giants Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు భారత ఐటీ దిగ్గజాలకు తాకినట్లు తెలుస్తున్నది. ఇన్ఫోసిస్ 600 మంది, విప్రో 800 మందిని తొలగించినట్లు సమాచారం.
Indian IT Giants Layoffs | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు భారత్ ఐటీ దిగ్గజాలకూ తాకినట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు గ్లోబల్ టెక్ దిగ్గజాలు గూగుల్ (Google), అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), మెటా (Meta) వంటి సంస్థలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకాయి. ఆ బాటలోనే భారత్ ఐటీ జెయింట్ ఇన్ఫీ (Infosys) సైతం ప్రయాణిస్తున్నదని తెలుస్తున్నది. ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) టెస్ట్‌లో ఫెయిల్ అయిన 600 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మరో ఐటీ సంస్థ విప్రో సైతం 800 మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తున్నది.
ఈ టెస్ట్ ఫెయిలైనందుకే ఉద్వాసనలు
గతేడాది ఆగస్టులో ఇన్ఫోసిస్(Infosys) లో చేరిన ఫ్రెషర్స్‌కు ఎస్ఏపీ ఏబీఏపీ స్ట్రీమ్ (SAP ABAP stream)లో శిక్షణ ఇచ్చింది. `నేను గత ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరా. నాకు ఎస్ఏపీ ఏబీఏపీ స్ట్రీమ్ (SAP ABAP stream)లో శిక్షణ ఇచ్చారు. నా టీమ్‌లో 150 మందికి గాను కేవలం 60 మంది మాత్రమే ఎఫ్ఏ పరీక్ష పాస్ అయ్యారు. మిగతా వారిని రెండు వారాల తర్వాత వారిని టర్మినేట్ చేశారు. చివరిగా (2022 జూలైలో ఇన్ఫోసిస్‌లో చేరిన ఫ్రెషర్స్) చేరిన 150 మందిలో సుమారు 85 మంది ఫ్రెషర్స్ ఎఫ్ఏ టెస్ట్ ఫెయిల్ కావడంతో టర్మినేట్ అయ్యారు` అని ఓ ఉద్యోగి తెలిపాడు.
ఇంటర్నల్ టెస్ట్ ఫెయిలైతే తొలగింపు మామూలేనా!
ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ పరీక్ష ఫెయిలైన 600 మందిని ఇన్ఫోసిస్ (Infosys) తొలగించిందని ఆ సంస్థ వర్గాల కథనం. రెండు వారాల క్రితం 208 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి సాగనంపింది. మొత్తం సుమారు 600 మంది ప్రెషర్స్‌ను తొలగించింది. అయితే, ఉద్యోగుల తొలగింపు విషయమై ఇన్ఫోసిస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మాత్రం 2022 జూలైకి ముందు కంపెనీలో చేరిన వారిని ఇన్ఫోసిస్ తొలగించలేదని చెబుతున్నారు. ఇంటర్నల్ టెస్ట్‌లో ఫెయిలైన వారిని తొలగించడం ఎల్లవేళలా సాగుతున్న ప్రక్రియేనని ఇన్ఫీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఆఫర్ లెటర్ ఇచ్చి.. ఉద్వాసన
ప్రతియేటా ఇంజినీరింగ్ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌కు ఐటీ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి.. తమ టెస్ట్‌ల్లో పాస్ అయిన వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం సాధారణ ప్రక్రియగా మారింది. కానీ ఎనిమిది నెలల క్రితం విప్రో (Wipro) నుంచి ఆఫర్ లెటర్లు తీసుకున్న ఫ్రెషర్స్.. ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, వారిలో వందల మందిని సంస్థ తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. రెండు వారాల క్రితం 800 మంది ఉద్యోగులు ఇంటర్నల్ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, 452 ఉద్యోగులను తొలగించామని విప్రో ప్రకటించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

