Vaccine Certificate : కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ నిజమైనదేనా? లేక నకిలీదా? ఈ సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండి
కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ నిజమైనదేనా? లేక నకిలీదా? | ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. దాని సర్టిఫికెట్ పొందడం కూడా అంతే ముఖ్యం. ఫస్ట్ డోస్
ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. దాని సర్టిఫికెట్ పొందడం కూడా అంతే ముఖ్యం. ఫస్ట్ డోస్ తర్వాత ఫస్ట్ డోస్ సర్టిఫికెట్, రెండో డోస్ పూర్తయ్యాక ఫైనల్ సర్టిఫికెట్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే.. చాలా పనులు అవుతున్నాయి. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. విమాన, రైళ్ల ప్రయాణాల్లో, టూరిస్టు ప్రాంతాల్లో, మాల్స్, మల్టిప్లెక్స్, టెంపుల్స్ లో ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను అడుగుతున్నారు. రెండు డోసులు పూర్తయిన వాళ్లు తమ సర్టిఫికెట్ ను తీసుకొని వెళ్తేనే పర్మిషన్ ఇస్తున్నారు. లేదంటే నో పర్మిషన్.

అందుకే.. చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్, ఆరోగ్య సేతు యాప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా ఆ యాప్స్ లోనే సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.
కానీ.. కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో.. కొందరు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఫేక్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అందిస్తున్నారు. భారత్ తో పాటు మరో 29 దేశాల్లో ఇలా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు సర్క్యులేట్ అవుతున్నట్టు ఇటీవల గుర్తించారు. ఏది నిజమైనదో.. ఏది ఫేక్ సర్టిఫికెటో చూస్తే చెప్పలేనంతగా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తయారు చేసి.. వాటిని డబ్బులకు అమ్ముతున్నారు కొందరు.

ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం.. కోవిన్ యాప్ లో ప్రత్యేకమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. కోవిన్(CoWIN) వెబ్ సైట్ కానీ.. యాప్ కానీ ఓపెన్ చేసి.. Platform అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ Verify Certificates అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే.. www.verify.cowin.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు.
అక్కడ Scan QR అనే గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే.. కెమెరా ఓపెన్ అవుతుంది. సర్టిఫికెట్ కింద ఉన్న క్యూఆర్ కోడ్ ను ఫోన్ లో స్కాన్ చేస్తే.. వెంటనే అది ఆ సర్టిఫికెట్ కు సంబంధించిన వివరాలను అక్కడ చూపిస్తుంది. అది జెన్యూన్ సర్టిఫికెట్ అయితేనే ఓ కోడ్ పనిచేసి.. సంబంధిత వ్యక్తికి సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలు అక్కడ డిస్ ప్లే అవుతాయి. లేదంటే సర్టిఫికెట్ ఇన్ వాలిడ్ అనే అక్కడ ఒక బాక్స్ లో మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. సర్టిఫికెట్ ఇన్ వాలిడ్ అని వచ్చిందంటే.. అది ఫేక్ సర్టిఫికెట్ అని తెలుసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Whatsapp Pay | వాట్సాప్‌లో ‘₹’ సింబల్.. ఇక ఈజీగా పేమెంట్స్
Slow Wi-Fi : వైఫై స్లోగా ఉందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే వైఫై సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో వర్క్ అవుతుంది
GriftHorse | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను వణికిస్తున్న కొత్త మాల్వేర్.. అసలేంటిది?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

