Aadhaar Card Fraud : మీ ఆధార్ కార్డు డిటెయిల్స్ సేఫేనా? సైబర్ నేరగాళ్ల వలకు ఆధార్ చిక్కకుండా ఏం చేయాలి?
మీ ఆధార్ కార్డు డిటెయిల్స్ సేఫేనా | ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునికమైన సాంకేతికత వల్ల రోజువారి పనులు ఎంతో సులభం అవుతున్నాయి.
ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునికమైన సాంకేతికత వల్ల రోజువారి పనులు ఎంతో సులభం అవుతున్నాయి. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కానీ.. టెక్నాలజీ వల్ల.. ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే.. టెక్నాలజీని వాడేవాళ్లు సైబర్ నేరగాళ్ల దృష్టిలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తుంటారు.

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలపై అన్ని రకాలుగా ఫోకస్ పెడుతూ.. వాళ్ల బ్యాంకు వివరాలు, ఆధార్ వివరాలను లాగేస్తున్నారు. దాంతో ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. అదే ఇప్పుడు అతి ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ నుంచి ఇతర అన్ని పనులకు ఆధార్ తప్పనిసరి. అందుకే.. సైబర్ క్రిమినల్స్ కన్ను ఆధార్ మీద పడింది.
ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఆధార్ ఉండాల్సిందే. అందుకే.. ఆధార్ వివరాల విషయంలో ప్రజలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. సైబర్ క్రిమినల్స్ చేతికి ఆధార్ వివరాలు చిక్కినట్టే.
చాలామంది ఇంటర్నెట్ కేఫ్, పబ్లిక్ ప్లేస్‌లలో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు కొన్ని విషయాలను మరిచిపోతుంటారు. అటువంటి ప్లేసులలో ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నా.. ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైనా అప్లికేషన్ పెట్టినా.. వాటికి సంబంధించిన డౌన్లోడ్స్ను వెంటనే ఆ సిస్టమ్ నుంచి డిలీట్ చేయాలంటూ యూఐడీఏఐ.. ప్రజలకు సూచిస్తోంది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పబ్లిక్ కంప్యూటర్లను వాడకండి. ఇంటర్నెట్ కేఫ్లలోనూ డౌన్లోడ్ చేయకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో డౌన్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసిన కాపీలను వెంటనే డిలీట్ చేయండి.. అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.
#BewareOfFraudsters
— Aadhaar (@UIDAI) September 16, 2021
To download an e-Aadhaar please avoid using a public computer at an internet café/kiosk.
However, if you do so, then it is highly recommended to delete all the downloaded copies of e-Aadhaar. #AadhaarAwareness #Aadhaar pic.twitter.com/oEy3kgWO3z
సైబర్ క్రిమినల్స్‌కు చిక్కకుండా ఉండేందుకు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు
ఆధార్‌తో లింక్ ఉన్న ఏ పని జరగాలన్నా.. ఖచ్చితంగా ఆధార్‌తో లింక్ అయి ఉన్న ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ను వెరిఫై చేయాలి. దాన్నే అథెంటికేషన్ ప్రాసెస్ అంటారు. ఇది ఫోన్‌తో పాటు మెయిల్ ఐడీకి కూడా వస్తుంది. అయితే.. ఈ ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు షేర్ చేయకూడదు. ఎవరైనా ఫోన్ చేసి ఆధార్ ఓటీపీ అడిగినా కూడా అస్సలు చెప్పకూడదు.
ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకోండి
ఆధార్‌లో అతి ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్ బయోమెట్రిక్. ఆధార్‌కు సంబంధించిన కొన్ని పనులు కావాలంటే ఖచ్చితంగా బయోమెట్రిక్‌తోనే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే.. కొందరు సైబర్ క్రిమినల్స్.. బయోమెట్రిక్‌ను కూడా ఫోర్జరీ చేస్తున్నారు. ఫింగర్‌ప్రింట్స్ ఫోర్జరీ చేసి ఆధార్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు లాగిన్ అయి మోసాలు చేస్తున్నారు. అందుకే.. ఆధార్ బయోమెట్రిక్స్‌ను అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవాలి. అప్పుడు మీ అనుమతి లేకుండా.. మీ బయోమెట్రిక్ ఫోర్జరీ చేసినా కూడా దాన్ని ఉపయోగించి.. ఆధార్‌ను యాక్సెస్ చేసుకోలేరు. ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకోవడానికి mAadhaar యాప్‌లో లాగిన్ అయి.. సెట్ చేసుకోవచ్చు.

మాస్క్ ఆధార్ లేదా వర్చువల్ ఐడీని ఎక్కువగా ఉపయోగించండి
ఆధార్ నెంబర్ లేకున్నా.. వర్చువల్ ఐడీ లేదా మాస్క్ ఆధార్‌తో కొన్ని పనులు అవుతాయి. అందుకే.. ఆధార్ నెంబర్ లేకుండా.. 16 డిజిట్స్ ఉండే వర్చువల్ ఐడీని ఎక్కువగా ఉపయోగించండి. దాని వల్ల సైబర్ క్రిమినల్స్‌కు ఆ వర్చువల్ ఐడీ దొరికినా.. ఆధార్ నెంబర్ తెలిసే చాన్స్ ఉండదు.

ఆధార్ కార్డును వెరిఫై చేసుకోండి
ఆధార్ కార్డును రెగ్యులర్‌గా వెరిఫై చేస్తూ ఉండాలి. ఆధార్ కార్డును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వెరిఫై చేసుకోవచ్చు. అలా వెరిఫై చేసుకుంటే.. ఆధార్ సెక్యూరిటీ ఇంకా పెరుగుతుంది. దాని కోసం యూఐడీఏఐ పోర్టల్‌లోకి వెళ్లి.. మై ఆధార్(My Aadhaar) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని Verify an Aadhaar Number అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. Aadhaar Services అనే సెక్షన్లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను వెరిఫై చేస్తే Proceed to Verify అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే.. ఆధార్ కార్డు వెరిఫై అవుతుంది. అక్కడ ఆధార్ కార్డు వాలిడిటీ స్టేటస్, అథెంటికేషన్ హిస్టరీ కూడా కనిపిస్తుంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Flying Cars : 2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
New App : దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
Space X | చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. 3 రోజులపాటు నలుగురు సాధారణ వ్యక్తులు స్పేస్‌లోకి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

