ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కాపాడుకోవడమెలా?
ఐఫోన్లలో ప్రధాన సమస్య బ్యాటరీ! ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పోలిస్తే యాపిల్ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. కాబట్టి బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకోవడం చాలా అవసరం.
ఐఫోన్లలో ప్రధాన సమస్య బ్యాటరీ! ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పోలిస్తే యాపిల్ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. కాబట్టి బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకోవడం చాలా అవసరం. బ్యాటరీ హెల్త్ తగ్గిపోయినా కొద్దీ.. ఇంకా త్వరగా ఫోన్ ఛార్జింగ్ దిగిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల యాపిల్ ఫోన్లలోని బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ హెల్త్ ఎలా చెక్ చేసుకోవాలి
మన మొబైల్ బ్యాటరీ బాగుందా? ఏమైనా డ్యామేజ్ అయిందా? కొత్త బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అనే విషయాలను తెలుసుకునేందుకు ఐఫోన్లలో ఒక సదుపాయం ఉంది. దీని ద్వారా బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఐఫోన్ 6, ఆపై మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవాలని అనుకుంటే..
- ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- అందులో బ్యాటరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
- బ్యాటరీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే బ్యాటరీ హెల్త్ అని కనిపిస్తుంది. అది 100 శాతం ఉంటే బ్యాటరీ హెల్త్ బాగున్నట్లు అర్థం. అదే 20 శాతం అంతకంటే తక్కువగా ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాల్సిందే.

ఎప్పటికప్పుడూ అప్డేట్ చేసుకోవాలి
బ్యాటరీ హెల్త్ కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడూ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోని జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అందులోని సాఫ్ట్వేర్ అప్డేట్పై క్లిక్ చేయాలి. ఏదైనా అప్డేట్ అందుబాటులో ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
బ్రైట్నెస్ తగ్గించుకోవడం
స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటే ఫోన్ ఛార్జింగ్ తొందరగా తగ్గిపోతుంటుంది. అదే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. ఇందుకోసం కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ఆటోబ్రైట్నెస్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే..
- సెట్టింగ్స్‌లోని జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- అందులో అసెసిబిలిటీలోకి వెళ్లి డిస్ప్లే అకమడేషన్స్ ఓపెన్ చేసి ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసుకోవాలి.

లో పవర్మోడ్ ఆన్ చేసుకోవాలి
ఐఫోన్లలో ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ కాగానే ఆటోమెటిగ్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫోన్‌ను లో పవర్మోడ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మ్యాన్యువల్‌గా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే..
- ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులోని లో పవర్ మోడ్‌ను ఆన్ చేసుకోవాలి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రీఫ్రెష్ ఆఫ్ చేసుకోవాలి
బ్యాటరీ ఎక్కువకాలం రావాలంటే.. అసలు మొబైల్లో చార్జింగ్ దేనికి ఎక్కువ ఉపయోగించుకుంటుందో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం సెట్టింగ్స్‌లోని బ్యాటరీలోకి వెళ్లి బ్యాటరీ యూసేజ్ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ యాప్ రీఫ్రెష్, లొకేషన్ సర్వీసెస్‌ను ఆఫ్ చేసుకోవడం మంచిది. సెట్టింగ్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ యాప్ రీఫ్రెష్ ఆప్షన్ ఓపెన్ చేసి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి లొకేషన్ సర్వీసెస్‌ను కూడా ఆఫ్ చేసుకోవడం మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆన్లైన్ క్లాసుల కోసం లాప్టాప్ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఐఫోన్ అంటే యమక్రేజీ.. ఆపిల్‌కు ప్రాఫిట్స్ పంట.. మిగతావీ అంతే..
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

