ఐఫోన్ అంటే యమక్రేజీ.. ఆపిల్‌కు ప్రాఫిట్స్ పంట.. మిగతావీ అంతే..
ఐఫోన్ అంటే యమక్రేజీ.. ఆపిల్‌కు ప్రాఫిట్స్ పంట.. మిగతావీ అంతే.. | ఐఫోన్లంటే ప్రతి ఒక్కరికీ క్రేజీ.. దాని ఆసరాగా ఆపిల్ భారీగా లాభాలు ..

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్.. 14 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఐఫోన్‌ను విపణిలో ఆవిష్కరించింది. నాటి నుంచి నెటిజన్లకు.. ప్రత్యేకించి టెక్కీలకు, వ్యాపారవేత్తలు.. అంతెందుకు.. కాస్త చేతిలో డబ్బున్న ప్రతి ఒక్కరికీ ఐఫోన్ అంటే యమ క్రేజీ.. ఇతర సంస్థల స్మార్ట్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో విపణిలోకి వచ్చినా ఐ-ఫోన్ గ్లామర్ డిఫరెంట్..

ఇప్పటికీ ఐ-ఫోన్ కొత్త మోడల్ విపణిలోకి వస్తుందంటే యాపిల్ స్టోర్ట వద్ద ప్రజలు దాని కొనుగోలు కోసం బారులు తీరేవారు. ఇప్పుడు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు అది వేరే సంగతి..
రూ. లక్ష మార్క్ దాటిన ఐఫోన్ రేట్
గత 14 ఏండ్లలో ఐఫోన్ ధరలు రూ. లక్ష మార్క్‌ను దాటేశాయి. కానీ ఇప్పటికీ ఐ-ఫోన్‌కు ఉన్న డిమాండ్ తగ్గలేదు. ఈ- ఐఫోన్ ఉత్పత్తి ఖర్చెంత?.. లాభమెంత?.. అన్న అంశం చర్చించుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలు శ్యామ్‌సంగ్, గూగుల్లదీ అదే దారి అంటే అతిశయోక్తి కాదు.

100 బిలియన్ల డాలర్లు దాటిన ఫోన్ సేల్స్
కరోనా మహమ్మారి వణికిస్తున్నా ఐఫోన్‌కు డిమాండ్ తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు సుమారు రూ.7.3 లక్షల కోట్లు (100 బిలియన్ల డాలర్లు) దాటేశాయి.వీటిలో ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అధిక రెవెన్యూ షేర్ దక్కించుకుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 11 మోడల్ తర్వాత జాబితాలో ఉంటాయి.

ఐఫోన్ 12 ప్రోపై బెనిఫిట్ 59.36%
అయితే, ఐఫోన్ 12 ప్రో (128 జీబీ) ఫోన్ ఉత్పత్తి వ్యయం సుమారు రూ.30 వేలు (అమెరికాలో 406 డాలర్లు). కానీ దాన్ని 999 డాలర్ల (రూ.74 వేలు)కు విక్రయిస్తున్నది ఆపిల్. అంటే ఒక ఐఫోన్‌పై లాభం 59.36 శాతం. మన కరెన్సీలో రూ.44 వేలు (593 డాలర్లు).

హార్డ్‌వేర్/సాఫ్ట్ వేర్ తయారీ ఖర్చు 40-60 %
ఒక ఫోన్ తయారీలో హార్డ్‌వేర్-సాఫ్ట్వేర్ ఖర్చు 40-60 నిష్పత్తి మధ్య ఉంటుంది. చౌకగా 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి రూ.1500-2000 ఖర్చవుతుంది. డిస్ ప్లే, సైజ్, కెమెరా మెగా పిక్సెల్ కూడా ముఖ్యమే. సాఫ్ట్ వేర్ కోసం రూ.2000 ఖర్చు చేయొచ్చు.

శ్యామ్‌సంగ్ ప్లస్ గూగుల్దీ అదే దారి
కేవలం ఐ-ఫోన్‌పై ఆపిల్ మాత్రమే 72 శాతం వరకు లాభాలు పొందడం లేదు. ఆపిల్ మాదిరిగానే శ్యామ్‌సంగ్, గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ప్రీమియం ఫోన్ తయారీపై భారీగా లాభాలు దండుకుంటున్నాయి.

శ్యామ్ సంగ్ గెలాక్సీ ఇలా..
శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఆల్ట్రా 12జీబీ రామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.1,00,200 (1350 డాలర్లు).కానీ దాని తయారీకి అయ్యే ఖర్చు రూ.39 వేలు (528 డాలర్లు). అంటే శ్యామ్‌సంగ్ సుమారు రూ.61,200 (822 డాలర్లు) లాభం వసూలు చేస్తున్నది.

గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్‌పై 62.84 % ఫ్రాపిట్
శ్యామ్‌సంగ్ మాదిరే గూగుల్ తన పిక్సెల్ ఎక్స్ఎల్ (32 జీబీ) స్మార్ట్ ఫోన్‌ను అమెరికాలో సుమారు రూ.57 వేల (769 డాలర్లు)కు విక్రయిస్తుంది. దాని తయారీ ఖర్చు సుమారు రూ.21,100 (285 డాలర్లు). దీని ప్రకారం ఒక హ్యాండ్ సెట్‌పై గూగుల్ 62.84 శాతం లాభం గడిస్తున్నది. రూ.35,900 (484 డాలర్లు) లాభం పొందుతున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

